● ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి మహిళల యత్నం ● నిర్ధాక్షిణ్యంగా లాగి పడేసిన పోలీసులు ● కేసులు నమోదు చేసి వేధింపులు
నినాదాలు చేస్తున్న అభినయ్, నేతలు
తిరుపతి మంగళం : ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి వెంటనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బస్సులో ఎక్కి గతంలో చంద్రబాబు ఉపన్యాసాల వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్బంగా మేయర్ శిరీష మాట్లాడుతూ కేవలం అధికార దాహంతో నోటికి వచ్చిన అబద్దాలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబుకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న ఆలోచన లేదా? అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణమని చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు మహిళలు బస్సులో ఎక్కితే పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, నిర్ధాక్షిణ్యంగా కిందకు లాగేశారని మండిపడ్డారు. ఆడబిడ్డలను దారుణంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లికి వందనం. ఉచిత బస్సు ప్రయాణమంటూ సీ్త్రలను వంచించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైఎస్సార్‌సీపీ మహిళలపై ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్‌బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ వాసుయాదవ్, డైరెక్టర్ కడపగుంట అమరనాథరెడ్డి, కార్పొరేటర్లు తమ్ముడు గణేష్, పునీతమ్మ, నేతలు ఉదయ్‌వంశీ, దినేష్‌రాయల్, మద్దాలి శేఖర్, అనిల్‌రెడ్డి, వెంకటేష్‌రాయల్, ఇమ్రాన్‌బాషా, సోమశేఖర్‌రెడ్డి, పసుపులేటి సురేష్, మల్లం రవి, అరుణ్‌యాదవ్, గీతాయాదవ్, మధుబాల, పద్మజ, విజయలక్ష్మి, సాయికుమారి, దుర్గ, లక్ష్మి పాల్గొన్నారు.
ఇదే చంద్రబాబు నైజం
వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇవ్వడం, అధికారంలోకి రాగానే వాటిని తుంగలో తొక్కడం చంద్రబాబు నైజమన్నారు. బస్సులో ఉచిత ప్రయాణం అనగానే ఎంతో ఆశతో ఓట్లు వేసి గెలిపించిన మహిళలను ఇప్పుడు అదే బస్సు నుంచి కిందికి లాగి పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలు చేయలేని హామీలు ఎందుకు ఇవ్వాలని మండిపడ్డారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడమేనా పాలన అంటే అని ప్రశ్నించారు. జగనన్న ఐదేళ్ల పాలనలో కులమతాలు, పార్టీలకు అతీతంగా ఇచ్చిన హామీల కంటే ఎక్కువే అమలు చేశారని కొనియాడారు. సంక్షేమ పథకాల రూపంలో రూ. 3లక్షల కోట్లను పేదలకు అందించారని వెల్లడించారు.
సూపర్‌సిక్స్ మోసంపై వైఎస్సార్‌సీపీ వినూత్న నిరసన
సూపర్‌సిక్స్ మోసంపై వైఎస్సార్‌సీపీ వినూత్న నిరసన