పాణం తీసిన బంగారు గొలుసు

రామగుండం: బంగారు గొలుసు దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. మాటామాటా పెరగడంతో ఆ గొడవలో భర్తను భార్య ఇటుకతో తలపై కొట్టి చంపేసింది. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పీటీఎస్‌లో శుక్రవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఎల్కలపల్లి గేటు ప్రాంతానికి చెందిన చిలుముల సుమన్ (40), పొట్యాల గ్రామానికి చెందిన స్పందన దంపతులు రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన సర్వెంట్ క్వార్టర్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవల స్పందన తన బంగారు గొలుసును సోదరుడికి ఇచ్చింది. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవ జరగడంతో స్పందన ఇటుకతో సుమన్ తలపై బాదింది. దీంతో సుమన్ రక్తం మడుగులో పడి విగతజీవిగా మారాడు.