విడాకుల కేసు: అడ్వకేట్‌తో ఆమె సన్నిహితంగా..! | Wife And Husband Incident In Hyderabad | Sakshi
Sakshi News home page

విడాకుల కేసు: అడ్వకేట్‌తో ఆమె సన్నిహితంగా..!

Mar 21 2026 11:44 AM | Updated on Mar 21 2026 11:44 AM

Wife And Husband Incident In Hyderabad

శంషాబాద్‌ రూరల్‌: భార్యాభర్తల మధ్య తగాదాల నేపథ్యంలో మహిళకు పరిచమైన ఓ అడ్వకేట్‌ ఆమెతో సన్నిహితంగా ఉంటున్నాడు.. ఇది తెలుసుకున్న భర్త.. వారిద్దరూ కారులో వెళ్తుండగా బైక్‌పై వెంబడించాడు. ఈ క్రమంలో భర్తతో పాటు మరో వ్యక్తిని కారుతో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో అడ్వకేట్‌తోపాటు మహిళను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు.. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన శివప్రసాద్, ఝాన్సీ దంపతుల మధ్య మనస్పర్దలు రావడంతో  భార్య దూరంగా ఉంటుంది. ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో ఉంది.  

ఝాన్సీ  ఓ ప్రైవేటు పాఠశాలలో పని చేస్తూ  నాగోల్‌లోని హాస్టల్‌లో నివాసముంటుంది. ఈ క్రమంలో మాధవరావు అనే అడ్వకేట్‌తో పరిచయమైంది. అతనితో సన్నిహితంగా ఉంటోందని నాగోలులో టీషాపు నిర్వహించే శివప్రసాద్‌ స్నేహితుడు కోడి నరేష్‌ గమనించి చెప్పాడు. దీంతో భార్య కదలికలను గమనించసాగారు. ఈ నెల 19న ఝాన్సీ ఉప్పల్‌ బస్‌స్టాప్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా చూశారు. శివప్రసాద్, నరేష్‌ బైక్‌పై బస్సును వెంబడించారు. 

ఆరాంఘర్‌ చౌరస్తాలో బస్సు దిగిన ఝాన్సీ అక్కడ ఓ కారులో ఎక్కింది. వీరు కారును వెంబడిస్తూ మండలంలోని మేకలబండతండా శివారులో పీ–వన్‌ రోడ్డుకు చేరుకున్నారు. అక్కడ కారును నిలపడంతో శివప్రసాద్‌ దగ్గరకు వెళ్లి మాట్లాడేప్రయత్నం చేశారు. అయితే కారును కొద్దిగా ముందుకు కదిలించి వేగంగా వెనక్కు వచ్చి ఇద్దరినీ ఢీకొట్టారు. ఈ ఘటనలో శివప్రసాద్, నరేష్‌కు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వీరిని సమీపంలో ఉన్న జిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు మాధవరావు, ఝాన్సీని హత్యాయత్నం కేసులో శుక్రవారం కోర్టులో హాజరుపర్చారు.  

Advertisement
 
Advertisement
Advertisement