సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్‌లో కొత్త పాలకవర్గాలు కొలువు తీరాయి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై ఎస్‌ఈసీ అధికారిక వివరాలు వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం కాంగ్రెస్ ఖాతాలో 82 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లు చేరాయి. బీఆర్‌ఎస్ ఖాతాలో 17 మున్సిపాలిటీలు చేరగా, బీజేపీ ఖాతాలో ఒక మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్ చేరింది. ఇక సీపీఐ ఖాతాలో కొత్తగూడెం కార్పొరేషన్ చేరగా, ఇండిట్లు నాలుగు మున్సిపాలిటీలను దక్కించుకున్నారు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై ఎస్‌ఈసీ అధికారిక వివరాలు
- కాంగ్రెస్ ఖాతాలో 82 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లు
- బీఆర్‌ఎస్ ఖాతాలో 17 మున్సిపాలిటీలు
- బీజేపీ ఖాతాలో ఒక మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్
- సీపీఐ ఖాతాలో కొత్తగూడెం కార్పొరేషన్
- నాలుగు మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లు
వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలు
- తొర్రూరు, జనగామ, డోర్నకల్ మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు వాయిదా..
- మిగిలిన 9 మున్సిపాలిటీలలో చైర్మన్ల ఎన్నిక పూర్తి..
- 9 చైర్మన్ పీఠాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ
- తొర్రూరు, జనగామ, డోర్నకల్ మున్సిపాలిటీలలో చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేసినట్టు ప్రకటించిన అధికారులు*
- భూపాలపల్లి మున్సిపాలిటీ - (కాంగ్రెస్) _ చైర్మన్ బుర్ర కొమురయ్య
- నర్సంపేట_ చైర్మన్ గా పెండెం శ్రీలక్ష్మి ( కాంగ్రెస్ )
- స్టేషన్ ఘన్పూర్_ మున్సిపాలిటీ చైర్మన్ గా తాటికొండ వినయ్ కుమార్ ( కాంగ్రెస్ )
- వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ గా పాలకుర్తి సారంగపాణి ( కాంగ్రెస్ )
- ములుగు మున్సిపాలిటీ చైర్మన్ గా చింతనిప్పుల చంద్రకళ ( కాంగ్రెస్ )
- మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ గుగులోతు జ్యోతి ( కాంగ్రెస్ )
- పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ ( కాంగ్రెస్ )
- మరిపెడ మున్సిపల్ చైర్మన్ వీసారపు ప్రగతి ( కాంగ్రెస్ )
- కేసముద్రం మున్సిపాలిటీ చైర్మన్ బానోత్ సునీత ( కాంగ్రెస్ ) ఎన్నిక
కాంగ్రెస్‌లో కొనసాగడంపై జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్
- జగిత్యాల మున్సిపల్ ఎన్నికపై జీవన్ రెడ్డి విచారం
- సంతోషమా.. బాధ అర్థం కావడం లేదు: జీవన్ రెడ్డి
- పార్టీ జెండా మోసిన వ్యక్తికే పదవి ఇవ్వాలని మెుత్తుకున్నా
- కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచించే పరిస్థితి వచ్చింది
- పార్టీలో ఉండాలా లేదా అనే సందిగ్ధత నెలకొంది
జగిత్యాల జిల్లా
- జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఇంటిపై దాడి
- మెట్‌పల్లి ఛైర్మన్ స్థానంపై బీజేపీ నేతల అసంతృప్తి
- అసంతృప్తితో మెట్‌పల్లిలోని ఇంటిపై దాడి చేసిన బీజేపీ నేతలు
- యాదగిరి ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేసిన కార్యకర్తలు
- బీఫామ్‌లు ఇవ్వడంలో యాదగిరి నిర్లక్షం చేశారని ఆరోపణ
- 10 సీట్లు గెలిచినా ఛైర్మన్ దక్కలేదని నేతల అసంతృప్తి
ఏడు కార్పొరేషన్లలో మేయర్ ఎన్నిక పూర్తి
- మహాబూబ్‌నగర్, నల్గగొండ, మంచిర్యాల, కాంగ్రెస్ కైవసం
- రామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం
- కొత్తగుడెం కార్పొరేషన్ కైవసం చేసుకున్న సీపీఐ
- కరీంనగర్ కార్పొరేషన్ చేజిక్కించుకున్న బీజేపీ
- మెుత్తంగా కాంగ్రెస్‌కు ఐదు కార్పొరేషన్లు కాంగ్రెస్ కైవసం
ఖమ్మం :
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు మున్సిపాలిటీలలో ఇల్లందు మినహా కొత్తగూడెం కార్పొరేషన్‌లో చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తి
- ఎదులాపురం మున్సిపాలిటీ చేర్మెన్ గా పోకబత్తిన అనిత, వైస్ చైర్మన్ గా తమ్మినేని నవీన్ లు ఏకగ్రీవంగా ఎన్నిక
- వైరా మున్సిపాలిటీ చైర్మన్ గా డాక్టర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ గా కట్ల సంతోష్
- మధిర మున్సిపాలిటీ ఛైర్మెన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోన ధని కుమార్
- మధిర మున్సిపాలిటీలో డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ఎక్స్ ఆఫీషియో సభ్యుడుగా తన ఓటు వినియోగించుకున్నారు
- సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్‌గా రెహానా బేగం, వైస్ చైర్మన్‌గా బొంతు సుమలత
- కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్‌గా ధరావత్ మోహన్ నాయక్ , వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి
- కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ సీపీఐ పార్టీకి చెందిన మూడ్ గణేష్
- వైస్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన సిరిపురపు లలిత కుమారి
- అశ్వారావుపేట మున్సిపాలిటీలోచైర్మన్, వైస్ చైర్మన్‌లుగా భార్యా, భర్తలు
- చైర్మన్‌గా జూపల్లి శశికళ
- వైస్ చైర్మన్ గా జూపల్లి రమేష్‌లు ఏకగ్రీవంగా ఎన్నిక
రంగారెడ్డి జిల్లా
- ఆమనగల్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ నేనవత్ పత్య నాయక్ క్లినిక్ పై దాడి చేసిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు
- బీఆర్‌ఎస్ నుండి కౌన్సిలర్‌గా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆగ్రహం
- బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన పత్య నాయక్
రంగారెడ్డి జిల్లా
- ఇబ్రహీంపట్నంలో క్యాంప్ రాజకీయాలు
- రహస్యప్రాంతాలకు కౌన్సిలర్ల తరలింపు
- అభ్యర్థులను తరలిస్తున్న పార్టీలు
- ఎన్నికలు వాయిదా పడడంతో అభ్యర్థుల తరలింపు
మహబూబాబాద్ జిల్లా
- ఎంపీ కడియం కావ్యపై బీఆర్‌ఎస్ ఫిర్యాదు
- కావ్య ఎక్స్ అఫిషియో ఓటు చెల్లదని బీఆర్‌ఎస్ ఫిర్యాదు
- గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో ఇదివరకే కావ్య ఓటు వేశారని ఫిర్యాదు
- హంగ్ వచ్చిన మూడు చోట్ల కాంగ్రెస్ పాగా
- కేసముద్రం,మహబూబాబాద్, వర్ధన్నపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశం
తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ
- ఒక కార్పొరేషన్, ఒక మున్సిపాలిటీ పూర్తిగా బీజేపీ కైవసం
- భైంసాలో ఇండిపెండెంట్ కు మద్ధతు
- ఐదు మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ల పదవులు దక్కించుకున్న బీజేపీ
- కరీంనగర్ కార్పోరేషన్ బీజేపీ వశం
- నారాయణపేట్ మున్సిపాలిటీ బీజేపీ కైవసం
- భైంసా ఇండిపెండెంట్లతో కలిసి బీజేపీ వశం
- 3 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చి వైస్ చైర్మన్లు దక్కించుకున్న బీజేపీ
- 1. ఆమన్ గల్ (కాంగ్రెస్ + బీజేపీ)-వైస్ చైర్మన్ దక్కించుకున్న బీజేపీ
- 2. జిన్నారం (బీఆర్ఎస్ + బీజేపీ)-వైస్ చైర్మన్ దక్కించుకున్న బీజేపీ
- 3. నర్సాపూర్ (కాంగ్రెస్ + బీజేపీ)-వైస్ చైర్మన్ దక్కించుకున్న బీజేపీ
- 4. అలియాబాద్ (కాంగ్రెస్ + బీజేపీ)-వైస్ చైర్మన్ దక్కించుకున్న బీజేపీ
- 5. ఎల్లంపేట (బీఆర్ఎస్ + బీజేపీ)-వైస్ చైర్మన్ దక్కించుకున్న బీజేపీ
నిర్మల్ జిల్లా
- భైంసా మున్సిపాలిటీ ఛైర్మన్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థి
- ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి తూముదత్తాత్రి
26స్థానాలకు 12 చోట్ల గెలిచిన ఎంఐఎం అభ్యర్థులు
సూర్యాపేట జిల్లా
- సూర్యాపేట మన్సిపల్ ఛైర్మన్‌గా మొరిశెట్టి నివేదిత
- వైస్ ఛైర్మన్‌గా ఎండీ షపీఉల్లా ఎన్నిక
- కోదాడ ఛైర్మన్‌గా వేర్నేని కుసుమ వెంకటరత్నం
- వైస్ ఛైర్మన్‌గా దేవర పల్లిమల్లీశ్వరి
- హుజూర్‌నగర్ ఛైర్మన్ డోంతగాని శ్రీనివాస్ గౌడ్
- వైస్ ఛైర్మన్‌గా తన్నీరు మల్లిఖార్జున
- నేరెడుచర్ల ఛైర్మన్‌గా కొణతం చిన వెంకట్ రెడ్డి
- వైస్ ఛైర్మన్‌గా నూకల సందీప్ రెడ్డి
- తిరుమలగిరి ఛైర్మన్‌గా ఎస్ రఘనందన్ రెడ్డి
- వైస్ ఛైర్మన్‌గా గోవిందమ్మ
యాదాద్రి జిల్లా
- భువనగిరి ఛైర్మన్‌గా తంగళ్ళపల్లి శ్రీవాణి
- వైస్‌ఛైర్మన్‌గా పోతంశెట్టి మంజుల
- యాదగిరిగుట్ట ఛైర్మన్ భరత్ గౌడ్
- వైస్ ఛైర్మన్‌గా బరిగే రమ్య ప్రమాణస్వీకారం
- చౌటుప్పల్ ఛైర్మన్‌గా మోగుదాల పావని
- వైస్ ఛైర్మన్‌గా గోశిక వినయ్ ప్రమాణస్వీకారం
- భూదాన్ పోచంపల్లి ఛైర్మన్ తడక వెంకటేశం
- వైస్ ఛైర్మన్‌గా కొయ్యడ రజిని
- ఆలేరు ఛైర్మన్‌గా బాలామణి
- వైస్ ఛైర్మన్‌గా ఇంగడి ఆంజనేయులు
- మోత్కూరు ఛైర్మన్‌గా గడ్డం స్వప్న
- వైస్ ఛైర్మన్‌గా పల్లెర్ల వెంకన్న
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్
- మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రమాణస్వీకారం
- డిప్యూటీ మేయర్‌గా అష్రఫ్ అలీ (ఆమీర్)
నల్లగొండ జిల్లా
- మిర్యాలగూడ ఛైర్మన్‌గా చిలుకూరు సుధ
వైస్ ఛైర్మన్‌గా పావని ప్రమాణస్వీకారం - చిట్యాల ఛైర్మన్‌గా పందిరి గీత ప్రమాణస్వీకారం
వైస్ ఛైర్మన్‌గా గుండెబోయిన శ్రీలక్ష్మి - దేవరకొండ: ఛైర్మన్‌గా పున్న శైలజ
వైస్ ఛైర్మన్‌గా జూబేరియా తబసుం - చండూరు: ఛైర్మన్‌గా కోడి శ్రీనివాసులు
వైస్ ఛైర్మన్‌గా దశరథ ప్రమాణస్వీకారం - హాలియా ఛైర్మన్‌గా చింతల రామచంద్రారెడ్డి
వైస్ ఛైర్మన్‌గా రాజా రమేష్ ఎన్నిక నందికొండ ఛైర్మన్‌గా గౌతమి
వైస్ ఛైర్మన్‌గా రాజా ప్రసాద్ ప్రమాణస్వీకారం.
మహబూబ్‌నగర్ మేయర్ కాంగ్రెస్ వశం
- మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మమత
రాష్ట్రంలో 11 మున్సిపల్ ఛైర్‌పర్సన్ల ఎన్నికలు వాయిదా - ఎన్నికలు నిర్వహించడానికి కనీస కోరం లేకపోవడంతో ఎన్నికలు వాయిదా
- ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక వాయిదా
- క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూర్ ఎన్నిక వాయిదా
నారాయణపేట మున్సిపాలిటీ బీజేపీదే
నారాయణపేట మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకున్న బీజేపీ
నారాయణపేట మున్సిపాలిటీ ఎన్నికలో ఎక్స్ అఫిషియో ఓటు వేసిన ఎంపీ డీకే అరుణ
ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫిషియో ఓటుతో నారాయణపేట మున్సిపాలిటీ చైర్మన్ పీఠం బీజేపీ కైవసం
ఇటీవల బీజేపీలో చేరిన ఒక స్వతంత్ర అభ్యర్థితో కలిపి 12కి చేరిన బీజేపీ బలం
12 మంది కౌన్సిలర్లతోపాటు, ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫిషియో ఓటుతో మేజిక్ ఫిగర్ 13కి చేరిన బీజేపీ బలం.
నారాయణ పేట మున్సిపాలిటీ చైర్మన్‌గా కొండా శ్వేత ఎన్నిక
నారాయణ పేట మున్సిపాలిటీ ఓటింగ్‌కి దూరంగా ఉన్న బీఆర్‌ఎస్
నారాయణపేట మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు.
మున్సిపాలిటీ చైర్మన్ పదవికి మేజిక్ ఫిగర్ 13..
11 వార్డులలో బీజేపీ విజయం.
7 వార్డులలో కాంగ్రెస్ విజయం.
2 స్థానాలలో BRS అభ్యర్థులు విజయం.
2 వార్డులలో AIMIM కైవసం.
ఒక వార్డులలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించగా.. ఇటీవల బీజేపీలో చేరారు
ఒక వార్డులో గెలిచిన AIFB అభ్యర్థి కాంగ్రెస్ కు మద్దతు.
పెద్దపల్లి జిల్లా:
మంథని మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్
వైస్ చైర్మన్‌గా ముస్కుల సహేందర్ రెడ్డి ఎన్నిక
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్:
కరీంనగర్ మేయర్‌గా బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ ప్రమాణం.
34 ఓట్లతో మేయర్ అభ్యర్థి ప్రకటన
కాంగ్రెస్- 14
టీఆర్ఎస్- 9
ఎంఐఎం- 3
ఇండిపెండెంట్స్- 8
నిజమాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ :
నిజామాబాద్ మేయర్ పీఠం కాంగ్రెస్ కైవసం
ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్
కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ఉమా రాణి
49వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన ఉమా రాణి.
డిప్యూటీ మేయర్ గా సల్మా తహసీన్
54 డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నిక ఎంఐఎం
కామారెడ్డి:
కామారెడ్డి మున్సిపాలిటీలో బిగ్ ట్విస్ట్
కాంగ్రెస్‌కు మద్దతు పలికిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు
కామారెడ్డి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి ఇప్ప ఉమారాణి ఎన్నిక
ఇబ్రహీంపట్నం:
ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత
మున్సిపల్ కార్యాలయంపై రాళ్లతో దాడి
ఎన్నికను ఆపాలంటూ కాంగ్రెస్,బీఆర్‌ఎస్ ఆందోళన
ఆందోళ కారుల్ని చెదరగొట్టిన పోలీసులు
కౌన్సిలర్ యాదగిరి కనిపించకుండా పోవడంతో అనుచరుల ఆగ్రహం
ఛైర్మన్,వైఎస్ ఛైర్మన్ ఎన్నిక కోసం కౌన్సిలర్ల కిడ్నాప్
తెలంగాణలో ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ ఎన్నికపై కొనసాగుతున్న ఉద్రిక్తతలు
మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్‌లలో పదవుల కోసం బీఆర్‌ఎస్,కాంగ్రెస్,బీజేపీ పోటీ
అభ్యర్థులను మభ్యపెడుతున్న పార్టీలు
అభ్యర్థుల కోసం క్యాంపు రాజకీయాలు
ఛైర్మన్,వైఎస్ ఛైర్మన్ ఎన్నిక కోసం కౌన్సిలర్ల కిడ్నాప్
పలు మున్సిపాలిటీల్లో నెలకొన్న హైటెన్షన్
రంగారెడ్డి:
ఇస్నాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో ట్విస్ట్
ఒకే కారులో వచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకునేందుకు వచ్చిన మహిపాల్‌రెడ్డి,రఘునందన్ రావు
ఎక్స్‌అఫిషియో ఓట్లతో బీఆర్‌ఎస్‌కు దక్కనున్న ఇస్నాపూర్ మున్సిపల్ పీఠం
తొర్రూర్ మున్సిపాలిటీ:
తొర్రూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ పదవికిపై ఉత్కంఠ
తొర్రూర్ మున్సిపల్ ఆఫీసుకు తొమ్మిది మంది బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు
బీఆర్‌ఎస్ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్ యత్నం అంటూ ఆరోపణలు
కాంగ్రెస్‌పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం
కాంగ్రెస్ ఎక్స్ అఫిషియో ఓట్లతో ఏదో చేయాలని కాంగ్రెస్ చూస్తోంది
ఎంపీ కడియం కావ్య 2025 ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించుకున్నారు
ఎంపీ కడియం కావ్య ఓట్లను పరిగణలోకి తీసుకుంటే హైకోర్టుకు వెళతాం.
రాజ్యాంగ బద్ధంగా, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవి మాదే.
జనగామ జిల్లా:
తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అడ్డగింత
తొర్రూరు మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వద్దకు వెళ్తున్న బస్సును అడ్డుకున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
జనగామ మండలం పెంబర్తి బైపాస్ వద్ద అడ్డుకున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
కౌన్సిలర్లను బెదిరించి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసిన ఎంపీ
కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తోపులట.
కరీంనగర్:
జమ్మికుంట మున్సిపల్ చైర్మెన్ వైస్ చైర్మన్ ఎన్నికలో కొనసాగుతున్న ఉత్కంఠ.
జమ్మికుంట మున్సిపల్ కార్యాలయానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తో సహా బి అర్ ఎస్ పార్టీ నుండి గెలిచిన కౌన్సిలర్‌లు ఇండిపెండెంట్‌లు
మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకున్న బీఆర్‌ఎస్, బీఅర్ఎస్ చైర్మెన్ పీఠం దక్కించుకునే అవకాశం.
కరీంనగర్:
కరీంనగర్ మేయర్ ఎన్నికల్లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ
కరీంనగర్ కార్పొరేషన్లో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్
మేయర్ సీటు కైవసం చేసుకుంటామని ముందే ప్రకటించిన బీజేపీ
బీజేపీ క్యాంప్ నుండి అభ్యర్ధులను లాగి ట్విస్ట్ ఇచ్చిన కాంగ్రెస్
ఈ క్రమంలో ఎవరికీ మద్దతు ఇవ్వకుండా మేయర్ ఎన్నికకు దూరంగా ఉండనున్న బీఆర్ఎస్
సూర్యాపేట జిల్లా:
కోదాడ మున్సిపాలిటీలో పదవి పంపకాలు
చైర్ పర్సన్ ఆశావాహులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో బుజ్జగింపు రాజకీయాలు
మొదటి రెండు సంవత్సరాలు చైర్ పర్సన్‌గా ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు
వైస్ ఛైర్మన్‌గా దేవారంపల్లి మల్లేశ్వరి నాగిరెడ్డి
అనంతరం మరో మూడు సంవత్సరాలు
చైర్ పర్సన్‌గా పారా సత్యవతి సీతయ్య
వైస్ చైర్మన్ గుండపునేని పద్మావతి నాగేశ్వరరావు పేర్లు ఖరారు
జగిత్యాల జిల్లా:
జగిత్యాల పట్టణ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం
సీల్డ్ కవర్‌లో చైర్మన్ అభ్యర్థి పేరు
ఇప్పటికీ చైర్మన్ అభ్యర్థిపై స్పష్టత ఇవ్వని అధిష్ఠానం
జీవన్ రెడ్డి, సంజయ్‌కు కూడా అందని సమాచారం
వాణి, జ్యోతి అనే ఇద్దరు కౌన్సిలర్ల పేర్లను అధిష్ఠానం ముందు ప్రతిపాదించిన ఎమ్మెల్యే సంజయ్
అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న జీవన్ రెడ్డి, సంజయ్
ఎవరి వర్గం వారు చైర్మన్, వైస్ చైర్మన్ కాబోతున్నారన్న ఉత్కంఠ.
కరీంనగర్:
కరీంనగర్‌లో శరవేగంగా మారుతున్న మున్సిపల్ కార్పోరేషన్ రాజకీయాలు..
రాత్రికి రాత్రే చక్రం తిప్పిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్
కాంగ్రెస్‌కు మేయర్, డిప్యూటీ పీఠాలు దక్కాలంటే బీఆర్ఎస్, ఇండిపెండెంట్స్, ఎంఐఎం మద్దతు తప్పనిసరి
కానీ, చేతులెత్తి ఓటేసే విషయంలో పీఠముడి
బీఆర్ఎస్ అభ్యర్థుల డిమాండ్లకు కాంగ్రెస్ సరైన స్పందన లేకపోవడంతో అలక
తటస్థంగా వ్యవహరించాలని నిర్ణయం..?
మేయర్, డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్ అభ్యర్థులు చేతులెత్తకపోతే బీజేపీదే విజయం
ఉత్కంఠగా మారిన కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ రాజకీయాలు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా:
వ్యూహ-ప్రతివ్యూహాల నడుమ మున్సిపల్ పోరు
ఎక్స్ అఫీషియో ఓట్లతో గేమ్ ప్లాన్
గెలుపు గుర్రాలను తేల్చేది ప్రజా ప్రతినిధులే
ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లతో పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల ఎత్తుగడలు
కింగ్ మేకర్లుగా స్వతంత్రులు
మొయినాబాద్, ఎల్లంపేటలో హంగ్ భయం
స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీల మధ్య వార్
వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మారుతున్న సమీకరణాలు.. క్లైమాక్స్‌కు చేరిన మున్సిపల్ ఉత్కంఠ
మేడ్చల్ జిల్లా :
జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యే చాన్స్
మల్లారెడ్డి, ఈటల మధ్య చర్చలు విఫలం
కాంగ్రెస్ నేత మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఎంపీ ఈటల మధ్య చర్చలు
ఎల్లంపేట లోనే మల్లారెడ్డి, ఈటల ఓట్ల నమోదు
ఎల్లంపేట 13-13 ఓట్లతో టై.. లాటరీ ద్వారా చైర్మెన్ ఎన్నుకుంటారా ?
బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థిని కాంగ్రెస్ వైపు తిప్పుకుంటారా ? అనేది ఉత్కంఠ
నిజామాబాద్:
నిజామాబాద్ : బోధన్ మున్సిపాలిటీలో వీడిన ప్రతిష్టంభన
కాంగ్రెస్, ఎం. ఐ. ఎం. మధ్య అవగాహన
చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం.
మున్సిపల్ చైర్మన్‌గా తూము శరత్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారు.
నిజామాబాద్:
నిజమాబాద్ జిల్లాలో మేయర్,చైర్మన్ల ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్,ఏడు మున్సిపాలిటీలు
నిజమాబాద్‌తో పాటు కామారెడ్డి, బోధన్‌లో హాంగ్
కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు మేయర్,ఎంఐఎంకు డిప్యూటీ మేయర్‌కు ఇచ్చేలా కుదిరిన ఒప్పందం
మేయర్ పరిశీలనలో ముగ్గురు మహిళల మధ్య పోటీ
ఎంఐఎం డిప్యూటీ మేయర్‌గా సల్మా తహసీన్ ఖరారు తొలిసారి మహిళకు అవకాశం
ఆర్మూర్, భీంగల్ ,ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కు పూర్తి ఆధిక్యం
సీల్డ్ కవర్‌లో చైర్మన్, వైస్ చైర్మన్ల పేర్లు పంపనున్న అధిష్టానం
మహబూబ్ నగర్:
నేడు మహబూబ్ నగర్ మేయర్, డిప్యూటీ మేయర్,చైర్మన్,వైస్ చైర్మన్‌ల ఎన్నిక
మహబూబ్ నగర్ కార్పోరేషన్‌లో కుదరని ఏకాభిప్రాయం
గంగరగోళంగా అభ్యర్దుల ఎంపిక
పదవి కోసం మైనార్టీల పట్టు
హంగ్ నేపద్యంలో గద్వాల,నారాయణ పేట,అమరచింతలో ఉత్కంఠత
క్యాంపుల నుంచి నేరుగా సమావేశలకు గెలిచిన అభ్యర్దులు
ఖమ్మం..
మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి
కౌన్సిలర్ల ప్రమాణం తర్వాత చైర్మన్ ,వైస్ చైర్మన్‌ల ఎన్నిక
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు కాంగ్రెస్‌కే
చైర్మన్ ,వైస్ చైర్మన్ పదవులకు తీవ్ర పోటీ..
నేడు పేర్లు ప్రకటించనున్న ఇన్‌ఛార్జ్ మంత్రి కొండ సురేఖ
కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం విషయంలో సిపిఐ ,కాంగ్రెస్‌ల మధ్య కుదిరిన ఒప్పందం
మొదటి రెండున్నర ఏళ్ళు సీపీఐకి మేయర్..కాంగ్రెస్‌కు డిప్యూటీ మేయర్
తర్వాత రెండున్నర ఏళ్ళు కాంగ్రెస్‌కు మేయర్ సీపీఐకి డిప్యూటీ మేయర్ పదవులు పంచుకునే విధంగా అంగీకారం
ప్రస్తుతం కొత్తగూడెం కార్పొరేషన్‌లో60 డివిజన్లో పార్టీల వారీగా గెలిచిన స్థానాలు
కాంగ్రెస్ 22, సిపిఐ 22 ,బి ఆర్ ఎస్ 8, బిజెపి 1, సిపిఎం 1, ఇతరులు 6చోట్ల గెలుపొందారు
ఇందులో ఐదుగురు స్వతంత్రులు నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక
జాతీయ రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్‌తో నడవాలని నిర్ణయించుకున్న సీపీఐ
అంతకుముందు కొత్తగూడెంలో హంగ్ వచ్చిన నేపద్యంలో సిపిఐకి బహిరంగంగా మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్
నిజమాబాద్ జిల్లా:
నేడు జిల్లాలో పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు సీతక్క, ఉత్తమ్ పర్యటన
నిజమాబాద్ మేయర్ ఎన్నికలో ఎక్స్ అఫిషియో గా ఓటు హక్కు వినియోగించుకోనున్న మహేష్ కుమార్ గౌడ్
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను పర్యవేక్షించనున్న మంత్రులు.
నల్లగొండ జిల్లా:
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో కొలువుదీరనున్న పాలకవర్గాలు
ఉదయం 10 గంటలకు సమావేశం. అనంతరం సభ్యుల ప్రమాణం
క్యాంపుల నుంచి నేరుగా సమావేశానికి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు
పలు మున్సిపాలిటీల్లో ఇంకా చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎవరో రాని స్పష్టత
నల్లగొండ మేయర్ గా ప్రమాణస్వీకారం చేయనున్న బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి.
ఇక్కడ డిప్యూటీ మేయర్ గా మైనార్టీ, బీసీ వర్గాలకు అవకాశం
దేవరకొండ చైర్ పర్సన్ గా పున్నా శైలజకు అవకాశం?
హాలియా చైర్మన్ గా చింతల చంద్రారెడ్డి
నందికొండ చైర్ పర్సన్‌గా మానసస్వర్ణ
మిర్యాలగూడ నుంచి పోటీలో నలుగురు
చండూరు చైర్మన్‌గా కోడిశ్రీనివాస్
చిట్యాల చైర్ పర్సన్‌గా పందిరి గీతకు అవకాశం
నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్‌గా కొణతం చిన వెంకటరెడ్డి. వైస్ చైర్మన్‌గా నూకల సందీప్ రెడ్డి
కోదాడ చైర్ పర్సన్ విషయంలో స్పష్టత కరువు. పోటీలో ఐదుగురు
సూర్యాపేట చైర్ పర్సన్‌గా మొరిశెట్టి నివేదిత
తిరుమలగిరి చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందిన రుఘునందన్ రెడ్డి
హుజూర్‌నగర్ మున్సిపల్ చైర్మన్ విషయంలో స్పష్టత కరువు.
భువనగిరి చైర్ పర్సన్ గా గంజి శ్రీవాణి, బర్రె పూజిత, పోతంశెట్టి మంజులలో ఒకరికి అవకాశం
చౌటుప్పల్ చైర్ పర్సన్ విషయంలో స్పష్టత కరువు
మోత్కూరు చైర్ పర్సన్ కోసం ముగ్గురు పోటీ
ఆలేరు చైర్ పర్సన్ పోటీలో ఇద్దరు
యాదగిరిగుట్ట చైర్ పర్సన్ గా వాణి ఎంపిక దాదాపు ఖరారే
పోచంపల్లి చైర్మన్ గా తడక వెంకటేష్ కు అవకాశం


