హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదల | Sakshi
Sakshi News home page

హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదల

Published Mon, Jun 21 2021 4:40 PM

University Of Hyderabad Admission 2021 22 Notification, Apply Online - Sakshi

రాయదుర్గం (హైదరాబాద్‌): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో 2021–22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌  విడుదలైంది. జూలై 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశవ్యాప్తంగా 39 కేంద్రాల్లో ఆగస్టు/సెప్టెంబర్‌లో పరీక్షను నిర్వహించనున్నారు. వర్సిటీలో 17 ఇంటిగ్రేటెడ్, 46 పీజీ, 10 ఎంటెక్, 44 పీహెచ్‌డీ కోర్సుల్లో మొత్తం 2,328 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంటెక్‌(మోడలింగ్‌ అండ్‌ సిములేషన్‌), ఎంపీఏ(మ్యూజిక్‌), పబ్లిషింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్సులను కొత్తగా ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఇదిలాఉంటే ఎంసీఏ, ఎంటెక్, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్సీ బయోటెక్నాలజీ తదితర కోర్సుల్లో నిమ్‌సెట్, గేట్, జేఈఈ, క్యాట్, జీఏటీ–బీ తదితర పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఎంటెక్‌(మోడలింగ్‌ అండ్‌ సిములేషన్‌) కోర్సులో గేట్‌ స్కోరు ఆధారంగా ప్రవేశాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.

చదవండి: తెలంగాణ పోలీస్‌ విభాగం, భరోసా సొసైటీలో ఖాళీలు

Advertisement
 
Advertisement
 
Advertisement