తెలంగాణ పోలీస్‌ విభాగం, భరోసా సొసైటీలో ఖాళీలు | Telangana Police, University of Hyderabad Recruitment 2021: Check Details Here | Sakshi
Sakshi News home page

తెలంగాణ పోలీస్‌ విభాగం, భరోసా సొసైటీలో ఖాళీలు

Jun 15 2021 8:06 PM | Updated on Jun 15 2021 8:08 PM

Telangana Police, University of Hyderabad Recruitment 2021: Check Details Here - Sakshi

తెలంగాణ ప్రభుత్వ పోలీస్‌ విభాగానికి చెందిన భరోసా సొసైటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఉమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌ ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

తెలంగాణ ప్రభుత్వ పోలీస్‌ విభాగానికి చెందిన భరోసా సొసైటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఉమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌.. సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట్, వరంగల్‌ జిల్లాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వరంగల్‌: పోస్టుల సంఖ్య 01

► పోస్టు: లీగల్‌ సపోర్ట్‌ ఆఫీసర్‌

► అర్హత: ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.

► వయసు: 35–55ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం నెలకు రూ.22,000 చెల్లిస్తారు.

వికారాబాద్‌: పోస్టుల సంఖ్య 02
► పోస్టులు: సపోర్ట్‌ పర్సన్, డేటాఎంట్రీ ఆపరేటర్‌ కమ్‌ అకౌంటెంట్‌.

► అర్హత: ఎంఏ సైకాలజీ/ఎంఎస్‌డబ్ల్యూ, టాలీతో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఎంఎస్‌ ఆఫీస్‌ స్కిల్స్‌తోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: సపోర్ట్‌ పర్సన్‌ 22–35ఏళ్ల మధ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కమ్‌ అకౌంటెంట్‌ 20–35ఏళ్ల మధ్య ఉండాలి.

► వేతనం సపోర్ట్‌ పర్సన్‌–నెలకి రూ.18,000, డేటాఎంట్రీ ఆపరేటర్‌ కమ్‌ అకౌంటెంట్‌–నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

సూర్యాపేట్‌: పోస్టుల సంఖ్య 06
► పోస్టులు: సెంటర్‌ కోఆర్డినేటర్‌ కమ్‌ సైకాలజిస్ట్, సపోర్ట్‌ పర్సన్, లీగల్‌ సపోర్ట్‌ ఆఫీసర్, మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ ఏఎన్‌ఎం, డేటాఎంట్రీ ఆపరేటర్‌ కమ్‌ అకౌంటెంట్, రిసెప్షనిస్ట్‌. 

► అర్హత: పోస్టుని అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఎస్సీ(నర్సింగ్‌), ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం, ఎంఎస్‌/ఎంఎస్‌డబ్ల్యూ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి.

సంగారెడ్డి: పోస్టుల సంఖ్య 01
► పోస్టులు: లీగల్‌ సపోర్ట్‌ ఆఫీసర్‌.
► అర్హత: ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 35–55 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం నెలకు రూ.22,000 చెల్లిస్తారు.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత జిల్లాల సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021
► వెబ్‌సైట్‌: https://womensafetywing.telangana.gov.in/


యూఓహెచ్, హైదరాబాద్‌లో వివిధ ఖాళీలు
హైదరాబాద్‌(గచ్చిబౌలి)లోని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌(యూఓహెచ్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 04

పోస్టుల వివరాలు: ప్రోగ్రామ్‌ మేనేజర్లు–03, ఆఫీస్‌ అటెండెంట్‌–01.

ప్రోగ్రామ్‌ మేనేజర్లు: అర్హత: పోస్టు గ్రాడ్యుయేషన్‌/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. వివిధ విభాగాల్లో పని అనుభవంతోపాటు మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. వేతనం నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

ఆఫీస్‌ అటెండెంట్‌: అర్హత: సెకండరీ ఎడ్యుకేషన్‌ ఉత్తీర్ణతతోపాటు ఆఫీస్‌ అటెండెంట్‌గా పని అనుభవం ఉండాలి. ఇంగ్లిష్‌ చదవడం, రాయడం వచ్చి ఉండాలి. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎమినెన్స్, ఐఓఈ డైరెక్టరేట్, డా.జాకీర్‌ హుస్సేన్‌ యూపీఈ లెక్చర్‌ హాల్‌ కాంప్లెక్స్, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, ప్రొఫెసర్‌ సీఆర్‌రావు రోడ్, గచ్చిబౌలి, హైదరాబాద్‌–500046 చిరునామాకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 25.06.2021

► వెబ్‌సైట్‌: https://uohyd.ac.in

Advertisement
 
Advertisement
Advertisement