సచివాలయం ముందు కత్తులతో హల్‌చల్..! | Two Rowdies at the Tamil Nadu Secretariat | Sakshi
Sakshi News home page

కత్తులు కట్టుకుని సచివాలయం ముందు హల్‌చల్..!

Jun 2 2026 8:00 AM | Updated on Jun 2 2026 11:41 AM

Two Rowdies at the Tamil Nadu Secretariat

తమిళనాడు: సచివాలయం ముందు రోడ్డుపై నడుముకు కత్తి కట్టుకుని బైక్‌పై ప్రయాణిస్తున్న రౌడీలు, వాహనదారులను బెదిరించిన ఘటన కలకలం రేపింది. చెన్నై సచివాలయం ఎదురుగా, రాజీజీ సాలై, కామరాజర్‌ సాలై వద్ద రాత్రి సమయంలో, ఇద్దరు రౌడీలు రోడ్డుపై వాహనదారులను వేధిస్తున్నారు. ఆ రౌడీలలో ఒకడు నడుముకు కత్తిని కట్టుకుని, బైక్‌ వెనుక కూర్చుని ఏమాత్రం బెరుకు లేకుండా వెళ్తున్నాడు. అతను గంజాయి మత్తులో ఉన్నాడు. 

ఒకానొక సమయంలో, అతను బైక్‌పై కూర్చుని, తన నడుముకు ఉన్న కత్తిని ప్రదర్శించే ఉద్దేశంతో రెండు చేతులూ బయటకు చాచాడు. అతని వెనుక ఉన్న ఒక వాహనదారుడు దీనిని తన సెల్‌ ఫోన్‌లో వీడియో తీసి, తమిళనాడులో ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితి ఇలా ఉంది అని పోస్ట్‌ చేశారు. అతను ఆ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌తో సహా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో ప్రజల్లో భయాన్ని సృష్టించింది. సచివాలయం కార్యాలయం ముందు  రోడ్డుపైకి వచ్చిన రౌడీలను గుర్తించేందుకు చెన్నై ట్రాఫిక్‌ పోలీసులు బైక్‌ రిజి్రస్టేషన్‌ నంబర్‌ను పరిశీలిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement