ఎంఎల్‌ఎం వలలో చిక్కుకోవద్దు: సజ్జనార్‌ | TSRTC MD VC Sajjanar About MLM Companies | Sakshi
Sakshi News home page

ఎంఎల్‌ఎం వలలో చిక్కుకోవద్దు: సజ్జనార్‌

Jan 20 2023 1:39 AM | Updated on Jan 20 2023 1:39 AM

TSRTC MD VC Sajjanar About MLM Companies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అత్యాశతో క్యూనెట్‌ వంటి మోసపూరిత మల్టీలెవెల్‌ మార్కె టింగ్‌ (ఎంఎల్‌ఎం) సంస్థల వలలో చిక్కు కోవద్దని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాటున క్యూనెట్‌ సంస్థ గొలుసుకట్టు పద్ధ తిలో అమాయకుల నుంచి రూ. వేల కోట్లు కొల్లగొట్టిందని ఆయన పేర్కొన్నారు.

క్యూనె ట్‌కు చెందిన 36 బ్యాంకు ఖాతాల్లోని రూ. 90 కోట్ల నగదును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాజాగా సీజ్‌ చేసిన నేపథ్యంలో సజ్జనార్‌ గురువారం ట్విట్టర్‌ వేదికగా ప్రజలకు ఈ సూచనలు చేశారు. గతంలో తాను సైబరా బాద్‌ పోలీసు కమిషనర్‌గా పనిచేసినప్పుడు క్యూనెట్‌ మోసాలపై పలు కేసులు నమోదు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశా రు. గొలుసుకట్టు సంస్థలకు ఎలాంటి అనుమ తులు ఉండవని, ఆర్‌బీఐ నియంత్రణలో లేని సంస్థలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement