
తెలంగాణ గ్రూప్-2 పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 29,30న గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-2 పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 29,30న గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు వారం ముందు నుంచే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) వెల్లడించింది.
ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పరీక్షా తేదీని నిర్ణయించామని అధికారులు పేర్కొన్నారు. కాగా, తెలంగాణలో గ్రూప్-2 పోస్టులకు సంబంధించి 783 పోస్టులకు గానూ 5,51,943 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. జనవరి 18 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించగా.. చివరి మూడు రోజుల్లోనే 1.10లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్-2 పరీక్షకు ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు.
చదవండి: నవీన్ హత్య కేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన హసన్