నేడు పదో తరగతి ఫలితాలు | TS 10th Class Results 2026 on April 29 at 2 PM | Sakshi
Sakshi News home page

నేడు పదో తరగతి ఫలితాలు

Apr 29 2026 8:07 AM | Updated on Apr 29 2026 8:07 AM

TS 10th Class Results 2026 on April 29 at 2 PM

సాక్షి, హైదరాబాద్‌: పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎస్సీఈఆర్‌టీ క్యాంపస్‌లోని గోదావరి ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఇ.నవీన్‌నికోలస్‌ ఫలితాలను విడుదల చేస్తారు. రాష్ట్రంలో మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 16 వరకు పదోతరగతి వార్షిక పరీక్షలు జరిగాయి. 5.17 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మరో 10 వేల మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. నెలరోజుల పాటు పరీక్షలు జరిగాయి. విద్యార్థులు ఫలితాలను 8096958096 వాట్సాప్‌ ద్వారా నంబర్‌ ద్వారా తెలుసుకోవ https://results.bsetelangana.org, https://schooledu. telanga na.gov.in, sakshieducation.com వెబ్‌సైట్‌లలో కూడా చూసుకోవచ్చు. 

Advertisement
 
Advertisement
Advertisement