సర్టీఫికెట్ల తనిఖీకి ప్రత్యేక సెంటర్‌!  | Sakshi
Sakshi News home page

సర్టీఫికెట్ల తనిఖీకి ప్రత్యేక సెంటర్‌! 

Published Sat, Sep 9 2023 3:41 AM

TREIRB DL Certificate verification dates 2023 for 1:2 list of Candidates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల కొలువుల నియామకాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) ఏర్పా ట్లు చకచకా చేస్తోంది. ఇప్పటికే అర్హత పరీక్షలన్నీ నిర్వహించిన బోర్డు... మెజార్టీ సబ్జెక్టు లకు సంబంధించి తుది కీలను సైతం విడుదల చేసింది. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్‌ టీచర్‌ కేట గిరీలకు సంబంధించి కోర్టు పరిధిలో కేసులుండటంతో ఆయా పరీక్షల తుది కీలను ఇంకా ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఫైనల్‌ కీలు ఖరారు చేసిన సబ్జెక్టులకు సంబంధించి మెరిట్‌ జాబితాలను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తోంది.  

9,210 పోస్టుల భర్తీకి..  
గురుకుల విద్యా సంస్థల్లో ప్రధానంగా 9 విభాగాల్లో 9,210 పోస్టుల భర్తీకి టీఆర్‌ఈఐ ఆర్‌బీ 9 రకాల ప్రకటనలు జారీ చేసింది. ఇందులో 61 సబ్జెక్టుల్లో ఈ పోస్టులున్నాయి. ఈ క్రమంలో ఒక్కో పోస్టుకు ఇద్దరు అభ్యర్థుల చొప్పున ఎంపిక చేస్తూ మెరిట్‌ జాబితాలు విడుదల చేస్తారు. 1:2 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థులు వారి ఒరిజినల్‌ సర్టీఫికెట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెరిఫికేషన్‌ సెంటర్‌కు హాజరై పరిశీలన ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.

తొలుత జిల్లాల వారీగా పరిశీలన కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడం... మరోవైపు రెండు వారాల పాటు పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తుండడంతో హైదరాబాద్‌లో ఒక కేంద్రం ఏర్పాటు చేస్తే సరిపోతుందని బోర్డు అధికారులు అంచనాకు వచ్చారు. ఈమేరకు పరిశీలన కేంద్రం ఏర్పాటు, నిర్వహణపైన కసరత్తు చేస్తున్నారు. 

ఆన్‌లైన్‌లో తేదీల ఎంపిక... 
వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థి ముందుగా టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ పద్ధతిలో స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. నిర్దేశించిన తేదీల్లో అభ్యర్తికి అనుకూలంగా ఉన్న ఒక రోజును ఎంపిక చేసుకుని ఆమేరకు పరిశీలనకు హాజరుకావాలి. ఈనెల మూడో వారం నాటికి మెరిట్‌ జాబితాలు రెడీ చేసేలా బోర్డు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. మెరిట్‌ జాబితాలు ఖరారైన తదుపరి వారంలోనే పరిశీలన ప్రక్రియ ప్రారంభించనుంది.  

Advertisement
Advertisement