2 రోజులుగా ఆచూకీలేని కుమారుడు
కేశంపేట: రెండు రోజులుగా కొడుకు కనిపించడం లేదని తీవ్ర మనోవేదనకు గురైన ఓ తండ్రి, అందరూ చూస్తుండగానే బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి తండ్రి మృతదేహాన్ని వెతు కుతుండగా, అదే బావిలో కొడుకు మృత దేహం బయటపడింది. ఈ సంఘటన రంగా రెడ్డి జిల్లా కేశంపేట పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ శివారు లోని అవాజ్‌మియాపడకల్‌కు చెందిన తూర్పా టి యాదయ్య (40) సంతాపూర్‌లో కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు.
యాదయ్య కుమా రుడు కన్నయ్య (11) శనివారం నుంచి కనిపించడం లేదు. కొడుకు కోసం వెతికిన కుటుంబ సభ్యులకు ఆచూకీ దొరకకపోవడంతో యాద య్య ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం కుటుంబంతో కలిసి అత్తగారి ఊరైన ఫరూఖ్‌నగర్ మండలంలోని గంట్లవెల్లికి వెళ్లాడు. అక్కడ భార్యాభర్తలు గొడవపడ్డారు. అనంతరం కొడుకును వెతికేందుకు సంతాపూర్‌కు వచ్చిన యాదయ్య తీవ్ర మనస్తాపంతో ఓబావిలో దూకాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు యాదయ్య మృతదేహాన్ని బయటికి తీస్తుండగా అదే బావిలో కన్నయ్య మృతదేహం కూడా లభ్యమైంది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నరహరి తెలిపారు.


