
సాక్షి, కరీంనగర్‌క్రైం: డ్రైనేజీలో పడిపోయిన కుక్కపిల్లను కాపాడి తల్లి చెంతకు చేర్చారు కరీంనగర్ ట్రాఫిక్ ఏఎస్సై మట్ట సురేందర్‌రెడ్డి. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు పక్కనే ఉన్న డ్రైనేజీలో ఆదివారం ఉదయం కుక్కపిల్ల పడింది. తల్లి కుక్క అరుస్తూ డ్రైనేజీ చుట్టూ తిరుగుతోంది. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఏఎస్‌ఐ సురేందర్‌రెడ్డి డ్రైనేజీ వద్దకు వెళ్లి చూడగా కుక్కపిల్ల పడిఉంది. వెంటనే ఆయన డ్రైనేజీలో చేయిపెట్టి కుక్కపిల్లను పైకితీసి తల్లిచెంతకు చేర్చారు. ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ కాగా, అందరూ ఆయనను ప్రశంసిస్తున్నారు.