ఎండకాలంలో జాగ్రత్త..!  ఆ టైంలో బైక్‌పై వెళ్లకపోవడమే ఉత్తమం | Tips And Tricks To Protect Your Bike And Car This Summer In telugu | Sakshi
Sakshi News home page

ఎండకాలంలో జాగ్రత్త..!  ఆ టైంలో బైక్‌పై వెళ్లకపోవడమే ఉత్తమం

Mar 11 2022 7:19 PM | Updated on Mar 11 2022 8:02 PM

Tips And Tricks To Protect Your Bike And Car This Summer In telugu - Sakshi

సాక్షి, ఖిలా వరంగల్‌: ఎండాకాలం వచ్చిందంటే చాలు భానుడి భగభగలతో మనం అల్లాడిపోతాం. ఉదయం పది దాటితే ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు సాహసించాల్సివస్తోంది. అత్యవసర పరిస్థితిల్లో బయటకు వస్తే దాహం తీర్చుకోవడానికి శీతలపానియాలు, పండ్లరసాలు తీసుకుంటాం. వేసవితాపానికి గురికాకుండా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అదేవిధంగా వాహన దారులు తమ వాహనాల పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు మెకానిక్‌లు. వాహనాల విషయంలో వేసవి జాగ్రత్తలు, సాంకేతిక సమస్యలు అధిగమించేందుకు నిపుణుల సలహాలు అవసరమనే పలువురు మోటారు టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. 

దూరప్రయాణం వద్దు..
కొంత మంది ద్విచక్రవాహనాలపై దూర ప్రయాణాలు ఇష్టపడతారు. ఎండాకాలంలో దూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఎండల్లో ఎక్కువ ప్రయాణించడం వల్ల ఇంజిన్, టైర్లు వేడెక్కుతాయి. టైర్లు పేలే అవకాశం, ఇంజిన్‌ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బైక్‌లపై తప్పనిసరి పరిస్థితుల్లో దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే మార్గమధ్యలో చల్లటి ప్రదేశాల్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం మంచిది.   

ఎండలో పార్కింగ్‌ చేస్తే అంతే..
వాహనాలను ఎండలో పార్కింగ్‌ చేస్తే జేబుకు చిల్లు పడడం ఖాయమంటున్నారు నిపుణులు. వేసవిలో వడదెబ్బతగలకుండా మనం ఎన్నో జాగ్రత్తలు పాటిస్తాం. కానీ, మనషులకే కాదు వాహనాలకు కూడా ఎండ తాకిడి ఉంటోంది. రంగు వెలసిపోవడం, పెట్రోలు ఆవిరైపోవడం వంటివి జరుగుతుంది.  
చదవండి: గుర్తుపెట్టుకోండి.. అలాంటి కాల్స్‌ చేసిన కటకటాలే!

జాగ్రత్తలు..
ఎండలో ఇంజిన్‌ ఆయిల్‌ త్వరగా వేడెక్కి పలచనవుతుంది. ఎండాకాలం మొదలవగానే ఇంజిన్‌ ఆయిల్‌ మార్చుకోవడం శ్రేయస్కరం. పెట్రోలు ట్యాంకుపై మందపాటి కవర్‌ ఉండేటట్టు చూసుకోవడం వల్ల కొంత వరకు పెట్రోలు ఆవిరి కాకుండా తగ్గించుకోవచ్చు. టైర్లు అరిగి ఉంటే మార్చుకోవాలి. ట్యూబ్‌లకు పంక్చర్లు ఉంటే వేసవి కాలంలో మార్చుకోవడం మంచిది. మధ్యాహ్నం ఎండలో ఎక్కువ సమయంలో పార్కింగ్‌ చేసి ఉంచితే వాహన జీవితకాలం తగ్గుతుంది. వేసవిలో ఇంజిన్‌ గార్డు తొలగించడం మంచిది. దూర ప్రయాణమైతే బస్సుల్లోనే వెళ్లడం ఉత్తమం.
చదవండి: బంజారాహిల్స్‌: పెళ్లి పేరుతో వంచింది..సహజీవనం చేసి...చివరికి

తప్పనిసరి పరిస్థితుల్లో వాహనం తీయాల్సి వస్తే మధ్య మధ్యన విరామం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంజిన్‌ వేడి తగ్గుతుంది. రాత్రివేళ ఒకసారి ట్యాంకు మూత తీసి మళ్లీ పెడితే మంచిది. దీంతో గ్యాస్‌ బయటకు పోయి ఆయిల్‌ సులువుగా ఇంజిన్‌లోకి వెళ్తుంది. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం 2నుంచి 4గంటల వరకు ద్విచక్రవాహనంపై ప్రయాణం చేయకపోవడం ఉత్తమం.

నీడలో పార్కింగ్‌ చేయాలి..
వేసవిలో ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం చేయొద్దు. ఎండవేడికి టైర్లు మెత్తపడి గాలిదిగి బైక్‌ నిలిచిపోతుంది. ప్యాచీలు కరిగి బైక్‌ అదుపు తప్పే ప్రమాదం ఉంది. ఇంజిన్‌లో శబ్ధం వచ్చి మొరాయిస్తుంది. నీడలో పార్క్‌చేయాలి.  
– ఎండీ జాఫర్, బైక్‌ మెకానిక్, వరంగల్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement