
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం 69,892 మందికి కరోనా పరీక్షలు చేయగా 1,061 మంది వైరస్ బారిన పడ్డారు. అంటే పాజిటివిటీ 1.51 శాతం నమోదైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.79 లక్షలకు చేరుకున్నాయి. తాజాగా 3,590 మంది కోలుకోగా, మొత్తం 7.54 లక్షల మంది కోలుకున్నారు. ఒక్క రోజులో కరోనాతో ఒకరు చనిపోగా, ఇప్పటివరకు వైరస్‌కు 4,102 మంది బలయ్యారు. ప్రస్తుతం 21,470 క్రియాశీలక కరోనా కేసులున్నాయి.