
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 2.850 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం 94,020 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 2,850 మంది వైరస్ బారినపడ్డారు. పాజిటివిటీ రేటు 3.03 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.66 లక్షలకు చేరింది. తాజాగా 4,391 మంది కోలుకోగా, మొత్తం 7.27 లక్షల మంది రికవరీ అయ్యారు. ఒక్కరోజులో కరోనాతో ఇద్దరు చనిపోగా, ఇప్పటివరకు వైరస్‌కు 4,091 మంది బలయ్యారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన కరోనా బులెటిన్ విడుదల చేశారు.