ట్రెజరీ ఉద్యోగుల అధ్యక్షుడిగా పురుషోత్తంరెడ్డి  | Telangana: Purushotham Reddy Elected As President Of Treasury Employees | Sakshi
Sakshi News home page

ట్రెజరీ ఉద్యోగుల అధ్యక్షుడిగా పురుషోత్తంరెడ్డి 

Dec 20 2022 3:36 AM | Updated on Dec 20 2022 3:36 AM

Telangana: Purushotham Reddy Elected As President Of Treasury Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ట్రెజరీ, అకౌంట్స్‌ గెజిటెడ్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా గంగుల పురుషోత్తంరెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం రాత్రి నిర్వహించిన ఎన్నికల్లో పురుషోత్తంరెడ్డి సమీప ప్రత్యర్థిపై ప్రదీప్‌కుమార్‌పై 30 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఫలితాలను ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లు సోమవారం విడుదల చేశారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పురుషోత్తంరెడ్డి ప్రస్తుతం రామన్నపేట ఎస్‌టీవోగా పనిచేస్తున్నారు. సహ అధ్యక్షుడిగా శ్రీనివాసరా వు, ప్రధాన కార్యదర్శిగా పరుశరామ్‌లతో పా టు ఆరుగురు ఉపాధ్యక్షులు, ఐదుగురు కార్యదర్శులతో పాటు ఇతర కార్యవర్గం ఎన్నికైంది 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement