రాజ్యసభకు ఎంపికలో బీసీలకు తీరని అన్యాయం

Telangana: Jajula Srinivas Goud Comments On CM KCR - Sakshi

ఏపీ సీఎం జగన్‌ సగం మంది బీసీలకు అవకాశం కల్పించారు: జాజుల  

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సీఎం కేసీఆర్‌ బీసీలకు తీరని అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతుల్యం లేదని, రెండు మూడు కులాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని గురువారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

బండా ప్రకాశ్‌ స్థానంలో వద్దిరాజు రవిచంద్రకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌...డి.శ్రీనివాస్‌ స్థానంలో బీసీలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.  రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సగంమంది బీసీలకు అవకాశం కల్పించారని కొనియాడారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top