డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం | Telangana Govt Allow Spot Admissions In Degree Colleges | Sakshi
Sakshi News home page

డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం

Nov 29 2022 1:10 AM | Updated on Nov 29 2022 10:09 AM

Telangana Govt Allow Spot Admissions In Degree Colleges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులకు మరో అవకాశం లభించింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో ప్రత్యేక స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తు­న్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి సోమ­వారం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి డిగ్రీలో చేరేందుకు సంబంధించిన దోస్త్‌ అడ్మిషన్ల ప్రక్రియ నవంబర్‌ 15తో ముగిసింది. ఇప్పటివరకూ వివిధ కోర్సుల్లో దాదాపు 2.20 లక్షల మంది ప్రవేశాలు పొందారు.

అయితే ఇప్పటివరకూ బీఫా­ర్మసీ, న్యాయవాద వృత్తి కోర్సుల్లో ప్రవేశా­నికి ప్రయత్నించిన విద్యార్థులు, అక్కడా సీటు రాకపోవడంతో డిగ్రీలో చేరేందుకు సిద్ధపడ్డారు. కానీ, దోస్త్‌ అడ్మిషన్ల తేదీ ముగి­య­డంతో విద్యార్థులు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రిని కలిసి పరిస్థితిని వివరించారు. ఆయన వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి దోస్త్‌ ప్రత్యేక స్పాట్‌ అడ్మిషన్ల తేదీని నిర్ణయించారు. దీంతో అనేకమంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరబోతోంది. దీనివల్ల మరో 15 వేల వరకూ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పెరుగు­తాయని భావిస్తున్నట్టు లింబాద్రి తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement