తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

Telangana Assembly Budget Sessions Sunday Live Updates - Sakshi

Live Updates..
తెలంగాణ శాసన సభ సమావేశాలు ముగిశాయి. సీఎం ప్రసంగం అనంతరం సభను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు.  మొత్తం 56.25 గంటల పాటు బడ్జెట్‌ సమావేశాలు కొనసాగాయి.

ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ సభ ఆమోదం తెలిపింది.

మొత్తం 192 దేశాల్లో మన దేశం ర్యాంక్‌ 139 అని సీఎం కేసీఆర్‌ అన్నారు. తలసరి ఆదాయంలో బంగ్లాదేశ్‌, శ్రీలంక కంటే భారత్‌ ర్యాంక్‌ తక్కువ ఉందన్నారు. 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ అనేది పెద్ద జోక్‌ అని.. మన దేశం 3.3 ట్రిలియన్‌ డాలర్ల దగ్గరే ఆగిపోయిందని తెలిపారు.  

పార్లమెంట్‌లో ప్రధాని స్పీచ్‌ అధ్వానంగా ఉందని విమర్శించారు. ఇంత జరుగుతున్నా అదానీపై మోదీ ఒక్కమాట మాట్లాడలేదని, దీనిపై పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కొట్లాడిందని ప్రస్తావించారు. తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లతో రాజకీయమేంటని ప్రశ్నించారు.

► అసెంబ్లీలో అక్బరుద్దీన్‌
కాగ్ నివేదికను ఎందుకు సభలో ప్రవేశపెట్టలేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను అరికట్టడంలో నార్కోటిక్స్ విఫలమైందని అన్నారు.

► శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాష్‌ ఏకగ్రీవ ఎన్నిక

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాష్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బండా ప్రకాష్‌కు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, సీఎం కేసీఆర్‌కు బండా ప్రకాష్‌ కృతజ్ఞతలు చెప్పారు. కాగా, బండా ప్రకాష్‌ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

► ఈ సందర్బంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. బండా ప్రకాష్‌ డిప్యూటీ ఛైర్మన్‌ కావడం అందరికీ గర్వకారణం. సామాన్య జీవితం నుంచి బండా ప్రకాష్‌ ఎదిగారు. ముదిరాజ్‌ల అభివృద్ధికి ప్రకాష్‌ ఎంతో కృషి చేశారు. 

► ఇక, బండా ప్రకాష్‌.. 1981లో మున్సిపల్‌ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2017లో టీఆర్‌ఎస్‌కు ప్రధాన కార్యదర్శిగా నియామకం. 

► శాసనమండలిలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. 21 రోజుల్లో బిల్డింగ్‌లకు అనుమతులు ఇస్తున్నాము. టీఎస్‌ బీపాస్‌ వంటి పథకం దేశంలోనే ఎక్కడా లేదు. అనుమతులు లేని లేఅవుట్లపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ధరణి పోర్టల్‌ వచ్చిన తర్వాత చిన్న భూమిని కూడా మ్యాప్‌ చేశాము. ఉస్మాన్‌సాగర్‌ను ఎట్టి పరిస్థితుల్లో కలుషితం కానివ్వం. 

► హైదరాబాద్‌ మెట్రో 69 కిలోమీటర్ల మేర ఉంది. రహేజా ఐటీ పార్క్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో ఉంది. ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోంది. తర్వలో లక్డీకాపూల్‌ నుంచి బీహెచ్‌ఈఎల్‌ వరకు మెట్రో మూడో దశ ప్రాజెక్ట్‌. పాతబస్తీ మెట్రోకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాం. తెలంగాణపై కేంద్రం కనీస కనికరం చూపించడం లేదు. ముంబై, తమిళనాడు, గుజరాత్‌ మెట్రోలకు కేంద్రం నిధులు ఇచ్చింది. హైదరాబాద్‌ మెట్రోకు పైసా కూడా ఇవ్వలేదు. మెట్రో ఛార్జీల పెంపు ఉండదు. ఆర్టీసీ తరహాలోనే ఛార్జీలు అందుబాటులో ఉండాలని చెప్పా​ం. 

► అసెంబ్లీలో మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఉస్మానియా, ని​మ్స్‌ వంటి పెద్ద ఆసుపత్రులకు బస్తీ దవాఖానాల వద్ద తాకిడి తగ్గింది. కోటి మంది ప్రజలు బస్తీ దవాఖానాల సేవలు పొందారు. త్వరలో బస్తీ దవాఖానాల్లో బయోమెట్రిక్‌ సేవలు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈనెలలో 1500 ఆశా పోస్టులు. ఏప్రిల్‌లో న్యూట్రిషన్‌ కిట్స్‌ పంపిణీ చేస్తాము. మేడ్చల్‌లో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తాం. 

► హైదరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. 

► కేసీఆర్‌ మాట్లాడుతూ.. మనం తినే ఆహారం పరిశుభ్రంగా ఉండాలి. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రతీ నియోజకవర్గంలో అధునాతన కూరగాయాల మార్కెట్‌, వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లలో మరిన్ని సౌకర్యాలు తీసుకుంటాము. గతంలో మోండా మార్కెట్‌ను సైంటిఫిక్‌గా కట్టారు. కలెక్టర్లందరికీ మోండా మార్కెట్‌ను చూపించాము. కల్తీ విత్తనాల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాము. కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్‌ పెడతాం. 

► తెలంగాణపై కేంద్రం పగబట్టినట్టు వ్యవహరిస్తోంది. హైదరాబాద్‌ మెట్రోకు నిధులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. పాతబస్తీ మెట్రోకు రూ.500 ​కోట్లు కేటాయించాము. 

 ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ.. గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించాలి. 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగా, నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. తొమ్మిదో రోజు బడ్జెట్‌ సమావేశాలకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, మంత్రి హారీష్‌ రావు కీలక ప్రకటనలు చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top