అక్రమ సిమ్‌కార్డుల దందాపై ఉక్కుపాదం.. మీ పేరు మీద ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసుకోండిలా..!

Strict Action Against Pre Activated Sim Cards Over Terror Links - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టెన్త్‌ క్లాస్‌ విద్యార్థి అభయ్‌ను కిడ్నాప్, హత్య చేసిన నిందితులు బేగంబజార్, సికింద్రాబాద్‌ల నుంచి నాలుగు ప్రీ–యాక్టివేటెడ్‌ సిమ్‌కార్డులు కొన్నారు. ఈ సిమ్స్‌ అన్నీ వేరే వ్యక్తుల పేర్లతో, గుర్తింపుతో ఉన్నవే. వీటిని వినియోగించే అభయ్‌ కుటుంబీకులతో బేరసారాలు చేశారు.   

► జేకేబీహెచ్‌ పేరుతో హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నిన ఉగ్రవాదులు సంప్రదింపులు జరపడానికి ప్రీ–యాక్టివేటెడ్‌ సిమ్‌కార్డుల్నే వినియోగించారు. 2016 నాటి ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించిన ఫహద్‌ ఈ తరహాకు చెందిన తొమ్మిది సిమ్‌కార్డుల్ని 
చారి్మనార్‌ వద్ద ఉన్న ఔట్‌లెట్‌లో ఖరీదు చేశాడు.  

► పంజగుట్టలో ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల పేరుతో ఎర వేసి, నిరుద్యోగులు, ప్రధానంగా మహిళల నుంచి డబ్బు కాజేసిన చక్రధర్‌ గౌడ్‌ సైతం పెద్ద సంఖ్యలో ప్రీ–యాక్టివెటెడ్‌ సిమ్‌కార్డులు వాడాడు. నేరగాళ్లతో పాటు అసాంఘికశక్తులు, ఉగ్రవాదులకు కలిసి వస్తున్న ప్రీ యాక్టివేషన్‌ దందాకు చెక్‌ చెప్పడానికి నగర పోలీసు విభాగం సిద్ధమైంది. అందులో భాగంగానే చక్రధర్‌ గౌడ్‌కు వీటిని అందించిన అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన కృష్ణమూర్తిని అరెస్టు చేశారు.  

నిబంధనలు పట్టించుకోని ఔట్‌లెట్స్‌... 
సెల్‌ఫోన్‌ వినియోగదారుడు ఏ సరీ్వసు ప్రొవైడర్‌ నుంచి అయినా సిమ్‌కార్డు తీసుకోవాలంటే ఫొటోతో పాటు గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలు కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ (డీఓటీ) నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అనేక మంది సిమ్‌కార్డ్స్‌ విక్రేతలు తమ దగ్గరకు సిమ్‌కార్డుల కోసం వచ్చే సాధారణ కస్టమర్ల నుంచి గుర్తింపులు తీసుకుని సిమ్‌కార్డులు ఇస్తున్నారు. పనిలో పనిగా వారికి తెలియకుండా స్కానింగ్, జిరాక్సు ద్వారా ఆయా గుర్తింపుల్ని పదుల సంఖ్యలో కాపీలు తీసుకుంటున్నారు. వీటి ఆధారంగా ఒక్కో వినియోగదారుడి పేరు మీద సిమ్‌కార్డులు ముందే యాక్టివేట్‌ చేస్తున్నారు.   

అరెస్టులతో పాటు డీఓటీ దృష్టికీ.. 
ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బోగస్‌ ధ్రువీకరణల్ని తీసుకువచ్చే నేరగాళ్లు వాటి ఆధారంగా సిమ్‌కార్డుల్ని తేలిగ్గా పొందుతున్నారు. ఈ దందాను అరికట్టాలంటే సిమ్‌కార్డ్‌ జారీ తర్వాత, యాక్టివేషన్‌కు ముందు సరీ్వస్‌ ప్రొవైడర్లు కచి్చతంగా ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ చేసే విధానం ఉండాల్సిందే. పోస్ట్‌పెయిడ్‌ కనెన్షన్‌ మాదిరిగానే ప్రీ–పెయిడ్‌ను పూర్తిస్థాయిలో వెరిఫై చేసిన తర్వాత యాక్టివేట్‌ చేసేలా ఉంటేనే ఫలితాలు ఉంటాయన్నది నిపుణులు చెబుతున్నారు. ఈ దందా చేస్తున్న వారిని అరెస్టు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవకతవకల్ని డీఓటీ దృష్టికి తీసుకువెళ్లాలని పోలీసులు నిర్ణయించారు.   

ఎవరికి వారు తనిఖీ చేసుకోవచ్చు..  
ప్రతి వినియోగదారుడూ తన పేరుతో ఎన్ని సిమ్‌కార్డులు జారీ అయ్యాయో తెలుసుకునే అవకాశం ఉంది. www.sancharsaathi.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. ఇందులోకి ప్రవేశించిన తర్వాత టాఫ్‌కాప్‌ పేరుతో ఉండే నో యువర్‌ మొబైల్‌ కనెక్షన్స్‌ లింక్‌లోకి ఎంటర్‌ కావాలి. అక్కడ కోరిన వివరాలు పొందుపరిచి, ఓటీపీ ఎంటర్‌ చేస్తే మీ పేరుతో ఎన్ని ఫోన్లు ఉన్నాయో కనిపిస్తాయి. అవన్నీ మీకు సంబంధించినవి కాకపోతే ప్రీ–యాక్టివేటెడ్‌విగా భావించవచ్చు. దీనిపై అదే లింకులో రిపోర్ట్‌ చేయడం ద్వారా వాటిని బ్లాక్‌ చేయించవచ్చు.
చదవండి: డిగ్రీలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top