మతసామరస్యం.. ముస్లిం మతపెద్ద చేతులమీదుగా రాములోరి పెళ్లి

Sri Rama Navami Marriage Rituals In The Presence Of Muslim Man Jagtial - Sakshi

జగిత్యాల జోన్‌: జగిత్యాల మండలం లక్ష్మీపూర్‌ రామాలయంలో ఆదివారం మతసామరస్యం వెల్లివిరిసింది. ముస్లిం మతపెద్ద ఎండీ హబీబ్‌ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపించారు. గ్రామ ఆదర్శ బలహీన వర్గాల సంఘం ఆధ్వర్యంలో రామాలయం నిర్మించి ఏటా సీతారాముల కల్యాణం ఘనంగా జరిపిస్తున్నారు. సంఘం అధ్యక్షుడు స్వామివారి కల్యాణం దగ్గరుండి జరిపించడం ఆనవాయితీ. 

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముస్లిం మతపెద్ద ఎండీ హబీబ్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన వేదమంత్రాల సాక్షిగా రాములోరి పెళ్లి జరిపించారు. అనంతరం జరిగిన శోభాయాత్రలో భక్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హబీబ్‌ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా తమ గ్రామంలో అన్ని పండుగలు జరుపుకుంటామన్నారు. వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లోనూ పాలు పంచుకుంటామని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top