నెహ్రూ జూ: చల్లందనమే..చల్లదనమే..!

Special Story On Nehru Zoological Park  Water Sprinklers Installed Over Animals Shed  - Sakshi

 జూపార్కులో వన్యప్రాణులకు చల్లదనం కోసం ఏర్పాట్లు

 స్ప్రింక్లర్లు, ఫాగర్స్, కూలర్లు ఏర్పాటు

వన్యప్రాణుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు 

బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్‌ పార్కులో వేసవి తాపం నుంచి వన్యప్రాణులకు ఉపశమనం కలిగించేందుకు జూ అధికారులు చర్యలు చేపట్టారు. జంతువులు, పక్షులు ఇబ్బంది పడకుండా చల్లదనం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జూపార్కు క్యూరేటర్‌ వీవీఎల్‌ సుభద్రా దేవి తెలిపారు. వన్యప్రాణుల ఎన్‌క్లోజర్ల పైభాగంలో గ్రీన్‌ పరదాలు, ఎండుగడ్డి, కొబ్బరి పీచును ఏర్పాటు చేసి నీటితో తడిపి చల్లదనాన్ని కల్పిస్తున్నామన్నారు.

  • అన్ని జంతువుల ఆవరణలో స్ప్రింక్లర్లు, చిన్న రెయిన్‌ గన్స్‌ ఏర్పాటు చేశారు. 
  • తుంగగడ్డిని కొన్ని ఆవరణల పైకప్పుపై ఉంచారు. 
  • కోతులు, పులులు, లయన్స్, జాగ్వార్స్, చిరుత పులి జంతువుల ఆవరణలలో 50కి ఎయిర్‌ కూలర్లు ఏర్పాటు చేశారు. 
  • రాత్రివేళ యానిమల్‌ హౌస్‌లో ఎయిర్‌ కండిషనర్లు ఏర్పాటు చేశారు. 
  • కోతులు, పక్షులు, ఎలుగుబంట్లకు పండ్లను అందజేస్తున్నారు.   
  • గ్లూకోన్‌–డీ, ఎలక్ట్రోరల్‌ పౌడర్, విటమిన్‌–సి, సప్లిమెంట్స్, బి–కాంప్లెక్స్‌ సప్లిమెంట్స్, థర్మోకేర్‌ లిక్విడ్‌ నీటిలో కరిగి వేసవి ఒత్తిడిని నివారించడానికి జంతువులు, పక్షులకు ఇస్తారు.  
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top