నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు | Heavy Rainfall Alert In Telugu States: Southwest Monsoon Arrives Early In Andhra Pradesh And Telangana, Check Weather Update Inside | Sakshi
Sakshi News home page

Rainfall Alert In AP And TS: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

May 26 2025 3:12 PM | Updated on May 26 2025 3:37 PM

Southwest Monsoon arrives early andhra,Telangana, heavy rains alert

సాక్షి,హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంతో పాటు,భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఏడాది తెలంగాణలో ఈసారి 13 రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఫలితంగా నేటి నుంచి నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.  

వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ,మహబూబ్‌ నగర్‌, నాగర్ కర్నూల్ ,వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్  జిల్లాల్లో భారీ ఎత్తున వర్షాలు పడనుండగా.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఈదురు గాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ నైరుతి రుతు పవనాలు విస్తరించాయి. వారం రోజులు ముందే రాష్ట్రాన్ని నైరుతి పలకరించింది. రాష్ట్రంలో ఆవరించిన ఉపరితల ద్రోణి ఛత్తీస్ ఘడ్ వరకు వ్యాపించి ఉంది.దీంతో రాగల 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ సమయంలో ఉత్తర , దక్షిణ కోస్తాల్లో తేలికపాటి ఈదురు గాలులు ఉంటాయి. రాబోయే నాలుగు రోజుల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. 

తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement