భయానక పరిస్థితిని ఎదుర్కొన్నా 

Smita Sabharwal Expressed Fellings Through Twitter Over House Breaking - Sakshi

అప్రమత్తతతో ఉండడమే ప్రాణాలను కాపాడింది

ట్విట్టర్‌లో స్మితా సబర్వాల్‌ ఆవేదన   

సాక్షి, హైదరాబాద్‌: ‘నా ఇంట్లో ఒక అగంతకుడు చొరబడటంతో గత రాత్రి అత్యంత భయానక పరిస్థితిని ఎదుర్కొన్నా. అప్రమత్తతతో ఉండటంతో నా ప్రాణాలను రక్షించుకోగలిగాను’అని ముఖ్యమంత్రి కార్యదర్శి స్మిత సబర్వాల్‌ ఆదివారం ట్విట్టర్‌ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఎంత సురక్షితంగా ఉన్నామనే భావనలో ఉన్నా.. ప్రతిసారీ తలుపులు, గడియలను స్వయంగా మనమే సరిచూసుకోవాలి’అన్న పాఠాన్ని ఈ ఘటన నేర్పిందని ఆమె పేర్కొన్నారు. ఆమె ఇంట్లో అర్ధరాత్రి వేళలో చొరబడిన ఓ డిప్యూటీ తహశీల్దార్‌తో పాటు అతడితో పాటు వచ్చిన మరో వ్యక్తిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించిన విషయం తెలిసిందే.   

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top