కేంద్ర ఎరువుల శాఖ మంత్రిని కలిసిన తెలంగాణ మంత్రి

Singireddy Niranjan Reddy Meets Union Fertilizer Minister In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఇవాళ(మంగళవారం) కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు కేంద్ర మంత్రిని కలిశానన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, ఎరువుల అవశ్యకత గురించి కేంద్రమంత్రికి వివరించినట్లు చెప్పారు. ఎపుడు లేని విధంగా రాష్ట్రంలో వ్యవసాయం పండించామని, వర్షాలు కూడా విస్తారంగా కురువడంతో రాష్ట్రంలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులు కళకళ లాడుతున్నాయన్నారు. ఎన్నడు లేని విధంగా ఈ ఏడాది కోటి ఇరవై లక్షల ఎకరాలలో వివిధ పంటలు వేశామని, ఎనిమిది లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉన్నట్లు కేంద్ర మంత్రికి తెలిపాన్నారు. ఈ స్థాయిలో దేశంలో సాగు విస్తీర్ణం ఎప్పుడు లేదని సీఎం కేసీఆర్ వ్యవసాయ సానుకూల నిర్ణయాలు తీసుకోవటం వల్లనే ఈ స్థాయిలో పంటలు వేసినట్లు కేంద్రమంత్రికి వివరించానని ఆయన పేర్కొన్నారు. 

వీటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి ఎరువులు ఎక్కువగా కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు సింగిరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, మిగతా ఎరువులు 11 లక్షల మెట్రిక్ టన్నుల వరకు అవసరం ఉన్నట్లు చెప్పామన్నారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున్న క్రమంలో ఎక్కడ ఏ మండలాల్లో, ఏ ఊరిలో ఎంత వర్షం పడుతుందో అధికారులు నమోదు చేసుకుంటున్నారని చెప్పారు. వర్షాలు కారణంగా రాష్ట్రంలో ఎక్కడ పంట నష్టం జరగలేదన్నారు. వరి సాగుకి కానీ పత్తి పంటకు కానీ ఎలాంటి నష్టం జరగలేదన్నారు. ఎక్కడైన నీళ్లు మల్లుకుంటే కాపర్ కార్బోనేట్ స్ప్రే ద్వారా పత్తి పంటను కపడుకోవచ్చని సింగిరెడ్డి తెలిపారు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top