Huzurabad Bypoll: 12 రోజుల్లో కోటి 27 లక్షల నగదు పట్టివేత | Security Tightened On Huzurabad ByElection | Sakshi
Sakshi News home page

Huzurabad Bypoll: 12 రోజుల్లో కోటి 27 లక్షల నగదు పట్టివేత

Oct 13 2021 11:39 AM | Updated on Oct 13 2021 11:43 AM

Security Tightened On Huzurabad ByElection - Sakshi

సాక్షి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నికపై నిఘా కట్టుదిట్టం చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఫేక్‌ న్యూస్‌లు స్ప్రెడ్‌ కాకుండా 24 గంటలు రెండు సైబర్‌ క్రైమ్‌ టీమ్స్‌ నిఘా ముమ్మరం చేశాయి. ఇప్పటికే ఎన్నికల ఉల్లంఘన ఘటనల్లో 33 కేసులు నమోదయ్యాయి. 12 రోజుల్లో కోటి 27 లక్షల రూపాయల నగదును పట్టుకున్నారు. మూడు లక్షల విలువైన మద్యం, గంజాయి, జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు, 75 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 1,900 మంది బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. త్వరలోనే హుజూరాబాద్‌కు కేంద్ర బలగాలు రానున్నాయి. నిరంతరం డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 406 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. హుజురాబాద్‌లో 110, జమ్మికుంటలో 169, వీణవంకలో 87, ఇల్లందకుంటలో 36  కెమెరాలు ఏర్పాటు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement