KIMS Hospital: ‘ఊపిరి’ ఆడుతుండగానే అమర్చారు.. దేశంలోనే తొలిసారి

Secunderabad Kims Hospital Doctors Perform Lung Transplant Surgery - Sakshi

కిమ్స్‌లో బ్రీతింగ్‌ లంగ్‌ మార్పిడి

విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులు

రాంగోపాల్‌పేట్‌: సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. దేశంలోనే తొలిసారిగా బ్రీతింగ్‌ లంగ్‌ (ఎక్స్‌వీవో ఆర్గాన్‌ పర్‌ఫ్యూజన్‌ సిస్టమ్‌) మార్పిడి శస్త్ర చికిత్సను ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రి ఊపిరితిత్తుల మార్పిడి విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ సందీప్‌ అత్తావర్‌ వెల్లడించారు. ‘మధ్య వయసున్న ఓ వ్యక్తి 2021 ఆగస్టు నుంచి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడు తున్నాడు. రోజూ 10 లీటర్ల ఆక్సిజన్‌ తీసుకుంటున్నాడు.

ఆ వ్యక్తికి ఆదివారం ఉదయం కిమ్స్‌ వైద్య బృందం బ్రీతింగ్‌ లంగ్‌ మార్పిడి శస్త్ర చికిత్స చేసింది. ఈ పద్ధతిలో ‘కోల్డ్‌ ఇష్కేమియా టైమ్‌’వల్ల వచ్చే దుష్ప్రభావాలు తగ్గి ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. దాతలు ఇచ్చిన ఊపిరితిత్తుల విని యోగం 30 శాతం ఎక్కువవుతూ రోగికి మరింత ఎ క్కువ కాలం ప్రయోజనం ఉంటుంది’అని చెప్పా రు. అమెరికా, కెనడా, ఆస్ట్రియా లాంటి దేశాల్లోని అతి కొద్ది సంస్థల్లోనే ఈ పద్ధతుల ద్వారా ఊపిరిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తున్నారన్నారు.  

అవయవాన్ని రవాణా చేసేటప్పుడు.. 
ముందే సేకరించిన అవయవాన్ని పోషకాలు, యాంటి బయాటిక్స్‌ ఉన్న ద్రావణంలో పెట్టడం వల్ల.. ఐస్‌ బాక్సులో రవాణా చేసే సమయంలో జరిగే కోల్డ్‌ ఇషేమిక్‌ ప్రభావం, గాయాల నుంచి కా పాడవచ్చని కిమ్స్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్‌ విజల్‌ రాహుల్‌ వివరించారు. ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరిచేందుకు వాటిని కండీషనింగ్‌ చేసి తద్వారా నీరు చేరడాన్ని తగ్గించవచ్చని తెలిపారు. వైద్యుల బృందాన్ని కిమ్స్‌ సీఈ వో డాక్టర్‌ అభినయ్‌ బొల్లినేని అభినందించారు.   

ఏంటీ బ్రీతింగ్‌ లంగ్‌ ప్రక్రియ?
బ్రీతింగ్‌ లంగ్‌ ప్రక్రియలో ఊపిరితిత్తులు ఆడుతున్నపుడే వాటిని చల్లబరిచే పరికరంలో పెడతారని, వెంటిలేటర్‌ సాయంతో కృత్రిమంగా ఊపిరి తీసుకునేలా చేస్తారని డాక్టర్‌ సందీప్‌ అత్తావర్‌ వివరించారు. ‘పోషకాలు, యాంటీ బయాటిక్స్‌ ఉన్న ద్రావణంలో ఆ ఊపిరితిత్తులను పెట్టడంతో ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ ఉంటే తగ్గుతుంది.

మెషీన్‌లోనే బ్రాంకోస్కోపి ద్వారా వాయు మార్గాలను శుభ్రం చేయడం, అదే సమయంలో పలు పరీక్షలు చేయడం వల్ల ఊపిరితిత్తులు చల్లబడేలోపే వాటి పనితీరు బాగా మెరుగవుతుంది. ఈ ప్రక్రియ అంతా స్పెషలిస్టుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఆ తర్వాత వాటిని గ్రహీతకు అమరుస్తారు’ అని చెప్పారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top