వెంటిలేటర్‌పై 30% యువకులే.. జాగ్రత్త

Sakshi Interview With Gandhi Hospital Superintendent‌ Rajarao Over Corona

పిల్లలకు వైరస్‌ కనిపించదు కానీ పెద్దలకు వ్యాపింపజేస్తున్నారు

రెమిడెసివిర్‌ అపర సంజీవని కాదు

తుసిలిజుమాబ్‌ మందుతోనూ ప్రయోజనంలేదు

రోగులే వీటికోసం ఒత్తిడి చేస్తున్నారు

ఆక్సిజన్‌ కోసం అనవసరంగా ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు

అందుకే అవసరమైన వారికి దొరకడం లేదు

గాంధీకి వచ్చే సీరియస్‌ కేసుల్లో 75 శాతం ప్రైవేట్‌వే

మూడు వారాల్లో వైరస్‌ తగ్గుముఖం పట్టొచ్చు

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజారావుతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ

రోనా బారిన పడిన అందరికీ ఆక్సిజన్‌ అవసరం పడదు. కానీ అనేక మంది భయంతో అనవసరంగా వాడుతున్నారు. మా వద్దకు వచ్చే రోగుల్లో 30 శాతం మంది అవసరం లేకపోయినా ఆక్సిజన్‌ కోసం వస్తున్నారు. అందువల్లనే అవసరమైన వారికి కూడా ఆక్సిజన్‌ దొరకని పరిస్థితి. గాంధీలో వెంటిలేటర్‌పై ఉన్న వారిలో 30% మంది యువకులే ఉన్నారు. అంటే 30–45 ఏళ్ల వయస్సు వారన్నమాట. సెకండ్‌ వేవ్‌లో యువకులు కూడా ఎక్కువగా వైరస్‌ బారినపడుతున్నారు. అలాగే చిన్నపిల్లల ద్వారా పెద్దలకు సోకుతోంది. పిల్లలకు వైరస్‌ కనిపించదు కానీ వారు పెద్దలకు వ్యాపింపజేస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: రెమిడెసివిర్, తుసిలిజు మాబ్‌... ఇప్పుడు వీటికున్న క్రేజే వేరు. వీటిని కరోనా రోగులపాలిట అపర సంజీవనిగా అందరూ భావి స్తున్నారు. ఇదే కరోనా సీరియస్‌ రోగులను కాపాడే గొప్ప మందుగా తలపోస్తున్నారు. కానీ ఇలాంటి యాంటీ వైరల్‌ డ్రగ్స్‌తో ప్రాణాలు నిలపడం సాధ్యం కాదని, వాటిని వాడాల్సిన అవసరమే లేదని తేల్చి చెబుతున్నారు హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు. వాటికోసం పిచ్చెక్కినట్లు బ్లాక్‌లో కొంటూ వేలు లక్షల రూపాయలు వృథా చేసుకుంటున్నారని అంటున్నారు. సెకండ్‌ వేవ్‌లో పిల్లలతోపాటు యువకులు కూడా ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని చెప్పారు. గాంధీలో 30 శాతం మంది యువకులే వెంటిలేటర్‌పై ఉన్నారన్నారు. కరోనా చికిత్సకు సంబంధించి వివిధ అంశాలపై ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే...

అవసరం లేకున్నా భయంతో ఆక్సిజన్‌...
కరోనా బారిన పడిన అందరికీ ఆక్సిజన్‌ అవసరం పడదు. అనేక మంది భయాందోళనతో అనవసరం గా వాడుతున్నారు. మా వద్దకు వచ్చే రోగుల్లో 30 శాతం మంది అవసరం లేకపోయినా ఆక్సిజన్‌ కోసం వస్తున్నారు. వాస్తవంగా ఆక్సిజన్‌ శాచురేషన్‌ స్థాయిలను బట్టి వాడాలా లేదా అనే నిర్ధారణకు వస్తాం. ఆక్సిజన్‌ శాచురేషన్‌ లెవెల్స్‌ 85 శాతం కంటే తక్కువగా ఉంటే అత్యంత విషమమైన పరి స్థితుల్లో రోగి ఉన్నట్లు లెక్క. 85–89 మధ్య ఉంటే విషమం, 90–93 శాతం శాచురేషన్‌ ఉంటే మధ్య స్థాయి, 93–95 వరకు ఉంటే మైల్డ్‌గా ఉన్నట్లు లెక్క. 95 అంతకంటే ఎక్కువగా శ్యాచురేషన్‌ ఉంటే సాధారణం కింద లెక్క. కానీ శాచురేషన్‌ స్థాయి 100 శాతం రావడంలేదని, 95 మాత్రమే ఉందని.. ఆక్సిజన్‌ పెట్టాలని అనేక మంది ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. అందువల్లనే అవసర మైన వారికి కూడా ఆక్సిజన్‌ దొరకని పరిస్థితి. చాలామంది దమ్ము అని ఆస్పత్రికి వస్తుంటారు.. కానీ వారిని చూస్తే సాధారణంగానే ఉంటారు.

వెంటిలేటర్‌పై 30 శాతం మంది యువకులే...
గాంధీలో వెంటిలేటర్‌పై ఉన్న వారిలో 30 శాతం మంది యువకులే ఉన్నారు. అంటే 30–45 ఏళ్ల వయస్సు వారన్నమాట. సెకండ్‌వేవ్‌లో యువకులు కూడా ఎక్కువగా వైరస్‌ బారినపడుతున్నారు. ఇక గతం కంటే ఇప్పుడు డాక్టర్లు ఎక్కువగా వైరస్‌కు గురవుతున్నారు. అలాగే చిన్నపిల్లల ద్వారా పెద ్దలకు సోకుతోంది. పిల్లలకు వైరస్‌ కనిపించదు కానీ వారు పెద్దలకు వ్యాపింపజేస్తున్నారు. అందుకే ప్రభుత్వం పాఠశాలు, కాలేజీలను మూసేసింది.

సీరియస్‌ కేసులను తగ్గించలేదు
రెమిడెసివిర్, తుసిలిజుమాబ్, ప్లాస్మాలు వాడితే కరోనా తగ్గుతుందన్న రుజువు లేనేలేదు. రెమిడెసివిర్‌ను వాడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెప్పింది. సీరియస్‌ రోగులను అది ఏమాత్రం సాధారణ స్థితికి తీసుకురాలేదు. రెమిడెసివిర్‌ కావాలని రోగులే ఎక్కువగా అడుగుతున్నారు. అది ఇస్తేనే సరైన వైద్యంగా భావిస్తున్నారు. దీనిపై జనాల్లో పిచ్చి అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ఇంజెక్షన్‌ ప్రాణాలను ఏమీ కాపాడదు. యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ అయిన రెమిడెసివిర్, తుసిలిజుమాబ్, ఫావిపిరావిర్‌లతో ప్రయోజనం లేదు. తుసి లిజుమాబ్‌ను డాక్టర్‌ నిర్ణయం మేరకు అత్యంత అరుదైన కేసుల్లోనే వాడాలి. ఈ మందు ఒక శాతం మందిలో కూడా అవసరం పడదు. అయితే రోగుల సంతృప్తి కోసం మాత్రమే ఇస్తున్నారు.

సివియర్‌ కేసుల్లో స్టెరాయిడ్‌ చికిత్స...
కరోనా లక్షణాలను బట్టే చికిత్స ఉంటుంది. సాధారణ కేసుల్లో డాక్టర్‌ సూచనల మేరకు మందులు వాడితే సరిపోతుంది. సీరియస్‌ కేసుల్లో స్టెరాయిడ్స్, యాంటీ ప్లేట్‌లెట్‌ డ్రగ్స్, యాంటీ కోయాగ్లెన్స్‌ మందులు అవసరాన్ని బట్టి వాడాలి. ఏ సమయంలో ఇవ్వాలో వాటిని అప్పుడు ఇస్తేనే సరిగా పనిచేస్తాయి. 

సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ విజృంభణ అధికం...
మొదటి వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉంది. ట్రిపుల్‌ మ్యుటేషన్‌ రాష్ట్రంలో గుర్తించలేదు. డబుల్‌ మ్యుటెంట్‌ వైరస్‌లైతే ఉన్నాయి. దీంతో వైరస్‌ ఇన్ఫెక్షన్‌ రేటు అధికంగా ఉంది. కుటుంబంలో ఒకరికి వస్తే ఇతరులకు వేగంగా వ్యాపిస్తుంది. దీంతో చాలామంది వైరస్‌ బారిన పడుతున్నారు. వందలో 80 మందికి ఇంట్లోనే రికవరీ అవుతుంది. మిగిలిన వారిలో ఐదుగురికి మాత్రమే ఆక్సిజన్‌ అవసరం పడుతుంది. వైరస్‌ విజృంభణ వల్ల అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ ఇప్పుడు కరోనా చికిత్సలకు అనుమతి వచ్చింది. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు పడకలు నిండుతున్నాయి. కేసుల సంఖ్య ఎక్కువుంది కాబట్టి అందులో సివియర్‌ కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మూడు వారాల్లో వైరస్‌ తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నాం.

టీకా వేసుకోండి... జాగ్రత్తలు పాటించండి
అనవసరంగా బయటకు పోవద్దు. సినిమాలు, పబ్స్, రెస్టారెంట్లు, బార్లకు వెళ్లొద్దు. అత్యవసరమైతే తప్ప శుభకార్యాలకు వెళ్లొద్దు. బర్త్‌డే పార్టీలు చేసుకోవద్దు. పండుగలను తక్కువ మందితో జాగ్రత్తలు తీసుకొని చేసుకో వాలి. ముక్కు, నోరు పూర్తిగా మూసుకునేలా మాస్క్‌ పెట్టుకోవాలి. తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి. ఏ కంపెనీ వ్యాక్సిన్‌ అని చూడకుండా ఏది అందుబాటులో ఉంటే దాన్ని వేసుకోవాలి. కరోనా నియంత్రణలో ఇవే కీలకమైన అంశాలు. 

-గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజారావుతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

06-05-2021
May 06, 2021, 11:43 IST
తిరువనంతపురం: కేరళలో కరోనా రెండో దశ విశ్వరూపం చూపిస్తోంది. రాష్ట్రంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్‌ కట్టడికి కేరళ...
06-05-2021
May 06, 2021, 08:18 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి లక్షలాది రూపాయలు ఫీజులుగా వసూలు చేస్తుండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం...
06-05-2021
May 06, 2021, 08:06 IST
సాక్షి, గాంధీఆస్పత్రి( హైదరాబాద్‌): మనోధైర్యంతో కరోనా మహమ్మారిని జయించారు.. నాలుగు గోడల మధ్య ఒంటరిగా హోంక్వారంటైన్‌లో ఉంటూ పాజిటివ్‌ దృక్పథంతో...
06-05-2021
May 06, 2021, 06:06 IST
జెనీవా (స్విట్జర్లాండ్‌): ఈ ఏడాదికి వాయిదా పడ్డ యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను సాఫీగా జరిపేందుకు నడుం బిగించిన యూనియన్‌...
06-05-2021
May 06, 2021, 05:33 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మూడురోజుల పాటు కాస్త తగ్గుముఖం పట్టిన రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసులు...
06-05-2021
May 06, 2021, 05:33 IST
సాక్షి, విశాఖపట్నం: దేశంలో విజృంభిస్తున్న కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌పై జరుగుతున్న సమరంలో భారత నౌకాదళం ఓ అడుగు ముందుకేసింది. ప్రస్తుత...
06-05-2021
May 06, 2021, 05:27 IST
పుట్టపర్తి అర్బన్‌: కరోనా.. ఎక్కడ విన్నా ఇదే మాట. పట్టణాలన్నీ వైరస్‌ బారిన పడినా.. కొన్ని పల్లెలు మాత్రం భద్రంగా...
06-05-2021
May 06, 2021, 05:24 IST
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆక్సిజన్‌ కొరత ఎందరి ప్రాణాలనో బలితీసుకుంటోంది. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా ప్రభుత్వాస్పత్రి కరోనా వార్డులో...
06-05-2021
May 06, 2021, 05:18 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందువల్ల దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరగాల్సిన ఉపఎన్నికలను వాయిదా...
06-05-2021
May 06, 2021, 05:17 IST
తిరుమల: కరోనా నియంత్రణలో భాగంగా బుధవారం నుంచి రాష్ట్రంలో మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల...
06-05-2021
May 06, 2021, 04:33 IST
కర్నూలు (హాస్పిటల్‌): కోవిడ్‌ బాధితుల్లో కొందరు శరీరంలో ఆక్సిజన్‌ శాతం తగ్గిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారిని కాపాడుకునేందుకు నిమిషానికి...
06-05-2021
May 06, 2021, 02:54 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొదటి డోసు వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి సకాలంలోనే రెండో డోసు వేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి...
06-05-2021
May 06, 2021, 01:52 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ కారణంగా పెద్ద సంఖ్యలో నమోదవుతున్న మరణాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో...
06-05-2021
May 06, 2021, 01:05 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో పరిస్థితులు పూర్తి నియంత్రణలో ఉన్నాయి. లాక్‌డౌన్‌తో ఉపయోగం లేదని నమ్ముతున్నాం. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించినా...
06-05-2021
May 06, 2021, 01:05 IST
ముంబై: రెండో దశ కరోనా వ్యాప్తితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ఆర్‌బీఐ ప్రకటించిన ఉద్దీపన చర్యలు స్టాక్‌ మార్కెట్‌ను...
06-05-2021
May 06, 2021, 00:57 IST
ముంబై: కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్గాలను ఆదుకునేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. వ్యక్తులు, చిన్న, మధ్య తరహా వ్యాపార...
06-05-2021
May 06, 2021, 00:40 IST
న్యూఢిల్లీ: కరోనా వల్ల అతలాకుతలం అయిన ఢిల్లీ ప్రజలకు తనవంతు సాయం అందించేందుకు భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌...
05-05-2021
May 05, 2021, 18:41 IST
అమరావతి: ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కరోనా కట్టడిలో భాగంగా ఏపీలో...
05-05-2021
May 05, 2021, 18:23 IST
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర వైద్యారోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారి...
05-05-2021
May 05, 2021, 18:01 IST
రాజస్థాన్‌లో షాకింగ్‌ ఉదంతం ఒకటి కలకలం రేపింది.  కరోనాతో మృతి చెందిన  తండ్రి మరణాన్ని తట్టుకోలేని  ఓ కుమార్తె ఆయన...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top