తొయ్యరా తొయ్యి.. హైలెస్సా!

RTC Bus Stuck On Road, Employees And Mechanics Pushed Into The Depot - Sakshi

సాక్షి, వనపర్తి: రోజంతా ఆడిన పాడిన పిల్లాడు సాయంత్రం ఇంటికి చేరడానికి అవస్థలు పడే లాగే.. ఉదయం డిపో నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన ఆర్టీసీ డీలక్స్‌ బస్సు సాయంత్రం డిపోలోకి చేరే సమయంలో మొరాయించింది. డ్రైవర్‌ శతవిధాల ప్రయత్నం చేసిన స్టార్ట్‌ కాకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు, మెకానికులు అందరూ కలిసి డిపోలోకి బస్సును నెట్టుకెళ్లారు. ఇంజన్, క్లచ్‌ ప్లేట్స్, తదితర కారణాలతో బస్సు మొరాయించిందని, అద్దె బస్సులు వినియోగంలో లేకపోవడంతో కాలం చెల్లిన బస్సులతో రాకపోకలు సాగించడం కష్టంగా ఉందని ఉద్యోగులు అంటున్నారు. పలుమార్లు ప్రయాణ మార్గ మధ్యంలోనే ఇబ్బందులు తల్లెత్తుతున్నాయని ఆర్టీసీ వర్గాలు బస్సు నెట్టుతున్న సమయంలో చర్చించుకోవడం గమనార్హం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top