న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై చర్చించారు. దాదాపు గంటకుపైగా కొనసాగిన ఈ సమావేశంలో.. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై తన అభిప్రాయాలను నేరుగా కేసీ వేణుగోపాలకు వివరించారు రేవంత్ రెడ్డి.
కొండా సురేఖపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత క్రమశిక్షణ రాహిత్యం పెరిగే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు అంటున్నారు. కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది.
బీసీ మహిళపై వేటు వేస్తే పార్టీకి వచ్చే నష్టంపైన కాంగ్రెస్ హై కమాండ్ బెరీజు వేస్తోంది. కొండా సురేఖ వివరణ తీసుకుని నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడు కర్గే రాహుల్ గాంధీకి కేసీ వేణుగోపాల్ అందజేయనున‍్నారు. ఆ తర్వాత కొండా సురేఖపై నిర్ణయాన్ని ఏఐసీసీ ప్రకటించనుంది.
కాగా, ఇటీవల రేవంత్ రెడ్డి మీద కొండా సురేఖ కూతురు సుస్మిత పలు వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత కాంగ్రెస్ చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కొండా సురేఖపై కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందా? అన్న ఉత్కంఠ నెలకొంది.


