తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ఆ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | Notification For Recruitment Of Specialist Doctor Posts In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ఆ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Aug 22 2025 6:25 PM | Updated on Aug 22 2025 6:53 PM

Notification For Recruitment Of Specialist Doctor Posts In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆరోగ్య శాఖలో 1623 స్పెషలిస్ట్‌ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్‌లో 1616, ఆర్టీసీ హాస్పిటల్‌లో 7 పోస్టులు భర్తీర చేయనున్నారు. దరఖాస్తులకు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ ప్రభుత్వం గడువు నిర్ణయించింది. పోస్టుల భర్తీతో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోని హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరగనుంది.

జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు మరింత మెరుగుపడనున్నాయి.  స్పెషాలిటీ వైద్య సేవలు.. పల్లెలకు చేరువ అవనున్నాయి. ఆరోగ్యశాఖలో ఇప్పటికే సుమారు 8 వేల పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం.. మరో 7 వేల పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement