తొలి విడత ఎన్నికల్లో 4,236 సర్పంచ్ పదవులకు 3,242 నామినేషన్లు
37,440 వార్డులకు 1,821 నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: తొలి విడతగా ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొద లైంది. మొత్తంగా 4,236 సర్పంచ్ పదవులకు 3,242 నామినేషన్లు, 37,440 వార్డులకు 1,821 మంది నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం చివరిరోజు కావడంతో ఎక్కువ మంది నామి నేషన్లు వేసే ఆలోచనలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
సర్పంచ్ నామినేషన్లు ఎక్కువ... తక్కువ ఇలా
» నల్లగొండ జిల్లాలో 318 సర్పంచ్ పదవులకు తొలిరోజు అత్యధికంగా 421 నామినేషన్లు దాఖలయ్యాయి. యాదాద్రి జిల్లాలో 153 సర్పంచ్ పదవులకు 209, సూర్యాపేట జిల్లాలో 159 పదవులకు 207, వరంగల్‌లో 91 పదవులకు 101, సంగారెడ్డిలో జనగామ జిల్లాలో 110 సర్పంచ్ పదవులకు 108 మంది నామినేషన్లు వేశారు.
» కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 114 సర్పంచ్ పదవులకుగాను 15 మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 166 సర్పంచ్ పదవులకు 32, మెదక్ జిల్లాలో 160 పదవులకు 55, మంచిర్యాలలో 90 పదవులకు 25, జగిత్యాలలో 122 సర్పంచ్ పదవులకు 48 నామినేషన్లు, భద్రాద్రి కొత్తగూడెంలో 159 పదవులకు 83, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 85 పదవులకు 42, ములుగు జిల్లాలో 48 పదవులకు 22, కామారెడ్డిలో 167 సర్పంచ్ పదవులకు 115 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
వార్డులకు మందకొడిగానే..
తొలి విడతలోనూ వార్డులకు నామినేషన్లు దాఖలు చేసిన వారి సంఖ్య స్వలంగానే ఉంది.
» మెదక్ జిల్లాలో160 పంచాయతీల్లోని 1,402 వార్డులుండగా, కేవలం 4 నామినేషన్లే దాఖలు అయ్యాయి. కొమురం భీం జిల్లాలోని 114 పంచాయతీ పరిధిలోని 944 వార్డులుండగా, ఇక్కడా నలుగురే నామినేషన్లు వేశారు.
» ఆదిలాబాద్ జిల్లాలో 166 పంచాయతీల్లో 1,390 వార్డులు ఉండగా 15, జోగులాంబ గద్వాల జిల్లాలో 106 పంచాయతీల్లో 974 వార్డులకు 13, మంచిర్యాల జిల్లాలో 90 పంచాయతీల్లోని 816 వార్డులు ఉండగా 14 మందే నామినేషన్లు దాఖలు చేశారు.
» నల్లగొండ జిల్లాలో 318 పంచాయతీల్లోని 2,870 వార్డులుండగా 212 నామినేషన్లు, రంగారెడ్డి జిల్లాలో 174 పంచాయతీల్లోని 1,530 వార్డులకు 119 మంది, సంగారెడ్డి జిల్లా 136 పంచాయతీల్లోని 1,246 వార్డులకు 149 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 153 పంచాయతీల్లోని 1,286 వార్డులకు 143 నామినేషన్లు దాఖలయ్యాయి.
టీ–పోల్ యాప్‌లో ఓటర్ స్లిప్
స్థానిక ఎన్నికలకు సంబంధించి సేవలను మరింత సులభతరం చేసేందుకు టీ–పోల్ (ఖ్ఛీ – ఞౌ)లో కొత్త మొబైల్ అప్లికేషన్ యాప్)ను ఎస్‌ఈసీ విడుదల చేసింది. ఈ యాప్ ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి, తమ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోవడానికి, సులభంగా ఫిర్యాదు చేయడానికి, ఫిర్యాదుల పరిష్కార ప్రగతిని (ట్రాకింగ్) తెలుసుకోవడానికి ఉపయోగపడు తుందని ఎస్‌ఈసీ కార్యదర్శి మందా మకరంద్ తెలిపారు. మొబైల్‌లో ప్లేస్టోర్ నుంచి ఈ లింకు ద్వారా https:// play. google. com/ store/ apps/ details? id= com. cgg. gov.in.te & poll & telugu> టీ–పోల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.


