హైదరాబాద్‌ ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌లో భారీగా ఉద్యోగాలు

NMDC Limited Recruitment 2022: Field Assistant, Maintenance Assistant, Vacancy Details - Sakshi

హైదరాబాద్‌లోని నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎండీసీ) లిమిటెడ్‌... ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 200

► పోస్టుల వివరాలు: ఫీల్డ్‌ అసిస్టెంట్‌(ట్రెయినీ)–43, మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌ (మెకానికల్‌ ట్రెయినీ)–90, మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌(ఎలక్ట్రికల్‌ ట్రెయినీ)–35, ఎంసీఓ గ్రేడ్‌ 3(ట్రెయినీ)–04, హెమ్‌ మెకానిక్‌ గ్రేడ్‌ 3(ట్రెయినీ)–10, ఎలక్ట్రీషియన్‌ గ్రేడ్‌3(ట్రెయినీ)–07, బ్లాస్టర్‌ గ్రేడ్‌ 2(ట్రెయినీ)–02, క్యూసీఏ గ్రేడ్‌–3 
(ట్రెయినీ)–09.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత ట్రేడులు/సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత సర్టిఫికేట్లతో పాటు పని అనుభవం ఉండాలి.

► వయసు: 02.03.2022 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.18,100 నుంచి రూ.35,040 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాతపరీక్ష, ఫిజికల్‌ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 02.03.2022

► వెబ్‌సైట్‌: nmdc.co.in

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top