Hyderabad: నగరంపై ‘కారు’ మబ్బులు! New Cars Increasing In Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: నగరంపై ‘కారు’ మబ్బులు!

Published Tue, Sep 27 2022 5:02 AM

New Cars Increasing In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గంటకు 14.. రోజుకు 336.. వారానికి 2,532.. నెలకు 10,080.. ఏడాదికి 1,20,960. ఈ లెక్క ఏమిటో తెలుసా? హైదరాబాద్‌లో రోడ్లపైకి వస్తున్న కార్లు వంటి కొత్త వాహనాల సరాసరి. గతేడాది నగరంలో జరిగిన వాహన కొనుగోళ్ల గణాంకాలను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. నగ­రంలో కార్లు వంటి తేలికపాటి వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఇతర వాహనాలు, చివరకు టూవీలర్స్‌ సైతం వీటి ‘వేగాన్ని’ అందుకోలేకపోతున్నాయి. 2001–2022 (ఫిబ్రవరి) మధ్య గణాంకాలను విశ్లేషిస్తే మొత్తం వాహనాల్లో ద్వి చక్ర వాహనాల శాతం తగ్గగా.. కార్ల శా తం పెరిగినట్లు కనిపిస్తోంది. తేలికపాటి వాహనాల్లో వ్యక్తిగతమైనవే అత్యధికం. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్య­త్తులో ట్రాఫిక్‌ జామ్‌లు’ తీవ్రం కాకతప్పదని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

తీసికట్టుగానే సిటీ రోడ్ల విస్తీర్ణం
హైదరాబాద్‌ నగర విస్తీర్ణంలో కేవలం 8.32 శాతం మాత్రమే రోడ్లు ఉన్నాయి. అంతర్జా తీయ ప్రమాణాల ప్రకారం కనీసం 12 శాతం ఉండాలి. రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే సిటీలో వాహనాల సంఖ్య పెరుగుతూ ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 37 లక్షలకు చేరువయింది. రోజూ కొత్తగా 600 వాహనాలు (అన్నీ కలిపి) రోడ్లపైకి వస్తున్నాయి. అయితే ద్విచక్ర వాహనాలకు పోటీగా కార్లు వంటి తేలిక పాటి వాహనాలు వస్తున్నాయి.

రోడ్డుపై ఒక్కకారు ఆక్రమించే స్థలంలో  కనిష్టంగా 4 ద్విచక్ర వాహనాలు ప్రయాణి స్తాయి. కొత్తగా వస్తున్న తేలికపాటి వాహనాల్లో వ్యక్తిగతమైనవే ఎక్కువగా ఉండటంతో అందులో ఒకరు లేదా ఇద్దరు చొప్పునే ప్రయాణిస్తున్నారు. అంటే రోడ్డుపై 8 మంది వెళ్లాల్సిన ప్రదేశాన్ని ఇద్దరే ఆక్రమిస్తున్నారన్న మాట. ఇదే ట్రాఫిక్‌ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. 

సిటీలో కార్ల పెరుగుదల ఇలా...
2001–22 (ఫిబ్రవరి) మధ్య వాహనాల పెరుగుదల గణనీయంగా కనిపించింది. 2001లో నగరంలోని వాహనాల సంఖ్య 10,91,734గా ఉండగా... 2022 ఫిబ్రవరి నాటికి 36,87,834కు చేరింది. తేలికపాటి వాహనాలు 2001లో మొత్తం వాహనాల్లో 11.58 శాతం కార్లు, 78.44 శాతం ద్విచక్ర వాహనాలు ఉండేవి. 2022 ఫిబ్రవరి నాటికి ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ద్విచక్ర వాహనాల శాతం తగ్గగా.. తేలికపాటి వాహ నాల వాటా పెరిగింది.

క్యాబ్‌లు మినహా యించినా ఇదే పరిస్థితి కనిపించింది. 2022 మే నాటికి మొత్తం వాహనాల్లో కార్ల శాతం 17.19కు చేరగా.. ద్విచక్ర వాహనాల వాటా 73.65 శాతానికి తగ్గింది. రుణ సౌకర్యాలు పెరగడం, ద్విచక్ర వాహనం ఖరీదు చేసే వారు నేరుగా కారుకు ప్రాధాన్యం ఇవ్వడం ఇందుకు కారణాలుగా కన్పిస్తోంది.

కొనసాగితే తిప్పలే..
రాజధానిలో వాహనాలు పెరుగు­తున్న స్థాయిలో కాకపోయినా కనీస స్థాయి­లోనూ రోడ్ల విస్తీర్ణం పెరగట్లేదు. ఫ్లైఓవ­ర్లు వంటి కొత్త మార్గాల ఏర్పాటు, ఉన్న వాటి విస్తరణ జరగ­ట్లేదు. మరో పక్క మెట్రోరైల్‌ నిర్మా­ణాల నేపథ్యంలో ఉన్న రహదారులూ అనేక చోట్ల కుచించుకుపోయాయి. ఈ పరిణామాల నేప­థ్యంలో తేలికపాటి వాహనాల పెరుగు­దలలో ఇదే ధోరణి కొనసాగితే భవిష్య­త్తులో మరిన్ని ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పవని ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని గతంలో శాసనసభ ఎస్టిమే ట్స్‌ కమిటీకి నివేదించామని చెప్తు­న్నారు.

కాగా ప్రజార­వాణా వ్యవస్థ సక్ర­మంగా లేకపోవ­డమే ఈ ధోరణికి కారణ­మని నిపు­ణులు వ్యాఖ్యా­నిస్తున్నారు. నగర జనా­భాకు చాలినంత స్థాయిలో ఆర్టీసీ బస్సులు లేకపోవడం, మెట్రోరైల్‌ వంటివి ఇంకా ఎక్కువగా అందుబా­టులోకి రాకపో­వడం వల్లే అనేకమంది వ్యక్తిగత వాహనాలపై ఆధారప­డుతున్నా­రని చెప్తున్నారు. వీటిని అభి­వృద్ధి చేస్తే ఈ స్థాయిలో పెరుగుదల ఉండదని స్పష్టం చేస్తు న్నారు. సింగపూర్‌లో ప్రస్తుతం కార్ల రీ–ప్లేస్‌మెంట్‌ విధానం అమలులో ఉంది. దీని ప్రకారం కొత్త ప్రత్యేక పరి స్థితుల్లో మినహా ఎవౖ­రెనా కారు కొనాలంటే పాతది చిత్తుగా మార్చాల్సి ఉంటుంది. ఇలాంటి వాటితో పాటు ఇతర చర్యలు చేపడితేనే ఈ సమ­స్య­కు ఓ పరిష్కారం లభిస్తుందని చెప్తున్నారు. (క్లిక్: పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ జారీకి కొత్త విధానం)

Advertisement
 
Advertisement
 
Advertisement