Nalgonda: నాగార్జునసాగర్‌లో ఎయిర్‌పోర్ట్‌! | New Airport Near Nagarjuna Sagar, Central Team Visits Site To Assess Suitability Of Land, More Details Inside | Sakshi
Sakshi News home page

Nalgonda: నాగార్జునసాగర్‌లో ఎయిర్‌పోర్ట్‌!

Jan 24 2025 12:10 PM | Updated on Jan 24 2025 1:24 PM

New airport near Nagarjuna Sagar: Central team visits site to assess suitability of land

భూములు పరిశీలించిన ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ అధికారులు

నాగార్జునసాగర్‌/సింగరేణి(కొత్తగూడెం): నాగార్జునసాగర్‌లో ∙1,600 ఎకరాలలో ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు అధికారులు స్థల పరిశీలన చేశారు. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌ ఏఎస్‌ఎన్‌ మూర్తి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం ప్రాజెక్టు సమీపంలో గతంలో ఏర్పాటుచేసిన రన్‌వే సమీపంలోని భూములను పరిశీలించింది. ఏపీలోని మాచర్ల మండలం విజయపురిసౌత్, పసువేముల, చింతలతండ, నాగులవరం భూములను గురువారం పరిశీలించారు. 

సాగర్‌ జలాలపై ‘సీ ప్లేన్‌’ను నడిపే ప్రతిపాదన ఉన్న నేపథ్యంలో ఇక్కడ మినీ విమానాశ్రయం ఏర్పాటుకు ఆవశ్యకత ఏర్పడింది. మరోవైపు కొత్తగూడెంలో విమానాశ్రయ ప్రతిపాదిత స్థలాన్ని ఉన్నతాధికారులు అబ్దుల్‌ అజీజ్, మహమ్మద్‌ సాకిబ్, ప్రశాంత్‌ గుప్తా, ఆర్‌.దివాకర్, మనీష్‌ జోస్వాల్, ప్రవీణ్‌ ఉన్ని కృష్ణన్‌ పరిశీలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement