ప్రభుత్వ ఆస్పత్రులకు బ్రాండింగ్‌ | Need to Brand Government Hospitals in Telangana: Damodara Rajanarasimha | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రులకు బ్రాండింగ్‌

Mar 30 2026 6:18 AM | Updated on Mar 30 2026 6:18 AM

Need to Brand Government Hospitals in Telangana: Damodara Rajanarasimha

మెడికల్‌ కాలేజీల్లో రెండు రకాలుగా కార్యక్రమాలు: మంత్రి రాజనర్సింహ  

పలు శాఖల పద్దులకు ఆమోదం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు బ్రాండింగ్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఆదివారం అసెంబ్లీలో బడ్జెట్‌ పద్దులపై సమాధానాలు ఇస్తున్న సమయంలో ఆయన మాట్లాడారు. గాంధీ ఆస్పత్రిని ఆధునీకరిస్తామని, నిమ్స్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ నిబంధనలకు అనుగుణంగా ప్రతి మెడికల్‌ కాలేజీలో 21 డిపార్ట్‌మెంట్‌లు ఉండాలని, కానీ కొన్నిచోట్ల లేకపోవడంతో నగరంలోని స్పెషలైజ్డ్‌ ఆస్పత్రులపై భారం పడుతోందని చెప్పారు.

ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రతీ మెడికల్‌ కాలేజీలో అన్ని విభాగాలను తెరుస్తామన్నారు. ప్రతి జనరల్‌ ఆస్పత్రికి బ్రాండింగ్‌ ఇస్తామని, సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఈ విషయాన్ని సూచించారన్నారు. మెడికల్‌ కాలేజీల్లో రెండు రకాల కార్యక్రమాలు ఉంటాయని, వైద్య సరీ్వసులకు సంబంధించి వైద్యులు పర్యవేక్షిస్తే... పరిపాలన వ్యవహారమంతా గ్రూప్‌ అధికారులతో నిర్వహిస్తామన్నారు.  

పద్దులకు ఆమోదం 
దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత 9,752 ఎకరాలు దేవాలయ భూములను పరిరక్షించినట్లు చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం అక్షింతలను కొరియర్‌ ద్వారా పంపిణీ చేసే సౌకర్యం కల్పించామన్నారు. దేవాలయాల అభివృద్ధితోపాటు భక్తుల వసతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మంత్రి జి.వివేక్‌ మాట్లాడుతూ.. దావోస్‌ సదస్సుతో రాష్ట్రంలో 7 లక్షల కోట్ల పెట్టుబడులు అవగాహన కుదిరిందన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణాహిత చేవెళ్ల తప్పకుండా పూర్తి చేస్తామన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో ప్రతీ చుక్కను రాష్ట్రం వినియోగించుకుంటుందని, నీటి హక్కులను కాపాడుకుంటామని, అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు.

అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో హామ్‌ విధానంలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, కొత్తగా 13006.27 కి.మీ. మేర కొత్త రోడ్లు వేస్తామన్నారు. వైద్య, ఆరోగ్యం, అటవీ, దేవాదాయ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, గనులు, కారి్మక శాఖ, నీటిపారుదల, పౌరసరఫరాలు, పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్యా శాఖలకు సంబంధించిన పద్దులపై చర్చ అనంతరం వాటిని ఆమోదించినట్లు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ప్రకటించారు. అనంతరం సభ సోమవారం ఉదయానికి వాయిదా వేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement