రాడార్‌ టెక్నాలజీతో నిర్ధారించాలి | NDSA teams suggestion on problems in Annaram barrage | Sakshi
Sakshi News home page

రాడార్‌ టెక్నాలజీతో నిర్ధారించాలి

Nov 21 2023 4:15 AM | Updated on Nov 21 2023 4:15 AM

NDSA teams suggestion on problems in Annaram barrage - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడా ర్స్‌ (జీపీఆర్‌) వంటి సాంకేతిక లేదా ఇతర పద్ధతులను వినియోగించి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బ్యారేజీలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని నేషనల్‌ డ్యా మ్‌ సేఫ్టీ ఆథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఏర్పాటు చేసి న నిపుణుల కమిటీ సూచించింది. కటాఫ్‌ వా ల్స్‌కి లేదా కటాఫ్‌ వాల్స్‌–ర్యాఫ్ట్‌ (పునాదులు) మధ్య పగుళ్లు ఎక్కడ వచ్చాయో నిర్ధారించాల ని తెలిపింది.

పగుళ్లను పూడ్చి వేయడానికి సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని, పునాదుల కింద బుంగలు ఏర్పడి ఉంటే ఆ ప్రాంతాల్లో తవ్వి వాటిని పూడ్చివేయాలని, సమస్యలకు మూలకారణాన్ని గుర్తించి నివారణ చర్యలు తీసుకునే వరకు బ్యారేజీలో నీళ్లను నిల్వ చేయరాదని స్పష్టం చేసింది. అన్నారం బ్యారేజీకి లీకేజీలను నిర్ధారించేందుకు ఈ నెల 2న ఎన్‌డీఎస్‌ఏ బృందం అన్నారం బ్యారేజీని సందర్శించింది. ఇటీవల ఎన్డీఎస్‌ఏకు నివేదిక సమర్పించింది. ఆ నివేదికను ఎన్డీఎస్‌ఏ రాష్ట్ర నీటిపారుదల శాఖకు పంపించింది.
 
లీకేజీలు పునరావృతం కావడంతో స్పష్టత 
రాఫ్ట్‌ కింద భూగర్భంలో నిర్మించిన కటాఫ్‌ వాల్స్‌ (బ్యారేజీ గేట్లను మూసివేశాక నీటి ఉధృతితో పీడనం పెరిగి బ్యారేజీ పునాదుల కింద నుంచి నీళ్లు బయటకు ప్రవహించే అవకాశం ఉంటుంది. ఇలా జరగకుండా బ్యారేజీ పునాదుల కింద రెండు వైపులా కటాఫ్‌ వాల్‌ నిర్మిస్తారు)కు పగుళ్లు వచ్చి ఉంటాయనడంలో సందేహాలు లేవని ఎన్డీఎస్‌ఏ దక్షిణాది ప్రాంతీయ డైరెక్టర్‌ ఆర్‌.తంగమణి, సీడబ్ల్యూసీ హైదరాబాద్‌ డైరెక్టర్లు ఎం.రమేశ్‌కుమార్, పి.దేవేందర్‌రావులతో కూడిన కమిటీ తన నివేదికలో తెలిపింది. లీకేజీలు పునరావృతం కావడాన్ని బట్టి కటాఫ్‌ వాల్స్‌లలో ఏదో ఒకదానికి లేదా రెండింటికీ పగుళ్లు వచ్చి ఉంటాయని స్పష్టమవుతోందని పేర్కొంది.  

చెప్పుకోదగిన రీతిలో నీళ్లు లీక్‌  
‘బ్యారేజీ 28, 38 గేట్లకు ముందు ప్రాంతం నుంచి చెప్పుకోదగిన రీతిలో నీళ్లు లీక్‌ అవుతున్నాయి. తాత్కాలికంగా లీకేజీని నివారణకు ఇసుక బస్తాలు, బౌల్డర్లను వేసి రింగ్‌ బండ్‌ నిర్మించారు. బ్యారేజీ గేట్ల ముందు భాగంలో కాంక్రీట్‌ బ్లాకులతో అప్రాన్‌ నిర్మించగా, దాదాపు బ్లాకులన్నీ కొట్టుకుపోయి చెల్లాచెదురయ్యాయి. కాంక్రీట్‌ బ్లాకులకు దిగువన నిర్మించిన ఇన్‌వర్టెడ్‌ ఫిల్టర్‌ సైతం కొట్టుకుపోయింది. బ్యారేజీకి 2020/21లో సైతం ఇదే తరహాలో లీకేజీలు చోటుచేసుకున్నట్టు బ్యారేజీ అధికారులు నివేదించారు.

3, 4 బ్లాకులతో పాటు 44వ గేటు ఎదుట అప్పట్లో బుంగలు ఏర్పడగా, ఇసుక బస్తాలు, బౌల్డర్లతో రింగ్‌బండ్‌ను ఏర్పాటు చేసి పూడ్చివేశారు. అనంతరం పాలీమర్‌ ఆధారిత సీలంట్‌ అనే రసాయన మిశ్రమంతో లీకేజీని నివారించారు. స్టీల్‌తో కూడిన (స్టీల్‌ రీఎన్‌ఫోర్స్‌డ్‌), సీŠట్‌ల్‌ లేని కాంక్రీట్‌ పిల్లర్లను ఒకదాని పక్కన మరొకటి పేర్చడం ద్వారా బ్యారేజీల పునాదులకు రెండు వైపులా భూగర్భంలో కటాఫ్‌ వాల్స్‌ నిర్మిస్తారు.

స్టీల్‌తో రీఎన్‌ఫోర్స్‌ చేయని పిల్లర్లకు పగుళ్లు వచ్చి ఎగువ, దిగువ కటాఫ్‌ వాల్స్‌కు సైతం పగుళ్లు వచ్చి ఉండే అవకాశం ఉంది. సీŠట్‌ల్‌ కలిగి ఉన్న, స్టీల్‌ లేని పిల్లర్ల మధ్య దృఢత్వంలో వ్యత్యాసంతో కటాఫ్‌ వాల్స్‌కి నిలువునా పగుళ్లు వచ్చి ఉండే అవకాశం కూడా ఉంది..’అని కమిటీ తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement