వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి!

Narasimhula Peta Mandal Vras Demands Govt Should Fulfill Promises - Sakshi

మహబూబాబాద్: నర్సింహులపేట మండలం వీఆర్‌ఏ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక మండల వీఆర్‌ఏలు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ వీఆర్‌ఏలకు 2017, 2020, 2022లో నిండు అసెంబ్లీలో వీఆర్‌ఏలకు పే స్కేల్‌, అర్హత గల వారికి ప్రమోషన్స్‌, 55సంవత్సరాలు నిండిన వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇచ్చిన హామీలు నేటికీ రెండు సంవత్సరాలు పూర్తి కావొస్తున్నా ఇంకా అమలు చేయలేదు అని అన్నారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరిచి జీవో విడుదల చేయాలని కోరుతూ డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఛైర్మెన్‌ యన్‌ శేకర్‌, జిల్లా ఉపాధ్యక్షడు ఎండీ మన్సూర్‌ అలీ, కొ వైర్మెన్‌ దర్మారపు ఉప్పలయ్య, కే.చైతన్య, యస్‌.సుధాకర్‌, లలిత, దివ్య, ఇర్ఫాన్‌, వెంకట నారాయణ, మోహన్‌, జనార్దన్‌, అబ్బాస్‌, రాములు, బిక్షం యకయ్య, మల్లయ్య, మనోజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top