తల్లిపై కొడుకు హత్యాయత్నం | mother and son incident at Bhadradri Kothagudem District | Sakshi
Sakshi News home page

తల్లిపై కొడుకు హత్యాయత్నం

May 25 2026 7:59 AM | Updated on May 25 2026 7:59 AM

mother and son incident at Bhadradri Kothagudem District

ఆసుపత్రి వద్ద కొడుకును కొడుతున్న తల్లి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మద్యం తాగేందుకు డబ్బు అడిగితే ఇవ్వలేదనే కారణంతో ఓ కుమారుడు తన తల్లి గొంతు పిసికి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన బానోతు దేవి భర్త మృతి చెందగా అంగన్‌వాడీ కేంద్రంలో ఆయా గా పనిచేస్తోంది. ఆమె కుమారుడు పవన్‌ ఏపనీ చేయకుండా తిరుగుతూ తాగుడుకు అలవాటు పడ్డా డు. అంతేకాక మద్యం డబ్బుల కోసం తల్లిని నిత్యం వేధిస్తున్నాడు. 

శనివారం అర్ధరాత్రి కూడా డబ్బు అడిగితే నిరాకరించడంతో అప్పటికే తాగిన మైకంలో ఉన్న పవన్‌ తన తల్లి గొంతు నులిమి చంపే ప్రయ త్నం చేస్తుండగా ఆమె కేకలు వేసింది. దీంతో చుట్టు పక్కల వారు వచ్చి పవన్‌కు దేహశుద్ధి చేయడమే కాక కాళ్లు, చేతులు కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి వారిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మద్యానికి డబ్బులు అడిగితే ఇవ్వనందుకు తనను చంపే ప్రయత్నం చేశాడని దేవి ఆదివారం ఇచ్చిన ఫిర్యాదుతో పవన్‌పై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ బి.సురేశ్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement