
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఆయన తన కూతురు జయారెడ్డితో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ, నియోజకవర్గ అభివృద్ధికి వెయ్యి కోట్లు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. మరి కొద్దిసేపట్లో అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: అసెంబ్లీ గేట్‌ని ఢీకొట్టిన వాణి దేవి కారు