
నిమజ్జన ఘట్టం సందర్భంగా ఆరీ్టసీ, రైల్వే, మెట్రో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి అర్ధర్రాతి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు నడుపనున్నట్లు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మెట్రో స్టేషన్ల వద్ద భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసినట్లు హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్ స్టేషన్లలో అదనపు టిక్కెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు .. సికింద్రాబాద్–నాంపల్లి, లింగంపల్లి
–సికింద్రాబాద్, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్–ఫలక్‌నుమా, నాంపల్లి
–ఫలక్‌నుమా స్టేషన్ల మధ్య శనివారం అర్ధరాత్రి వరకు ఎంఎంటీఎస్
ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు.