
సాక్షి, ఖమ్మం: ఖమ్మం పోలీసుల ఎదుట మావోయిస్టు నేత ఎక్కంటి సీతారామిరెడ్డి శుక్రవారం లొంగిపోయారు. ప్రస్తుతం సీతారామిరెడ్డి మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ మెంబర్‌గా ఉన్నారు. ఆయన సొంత గ్రామం అశ్వపురం మండలం చింతిర్యాల గ్రామం. అయితే ఇటీవలే మందు పాతర పేలిన ఘటనలో సీతారామిరెడ్డి తన చేతిని కోల్పోయారు.