ఎనిమిది వారాల్లో కాలేయ మార్పిడి రోగులు కోలుకుంటున్నారు.. | Liver Transplant Patients Are Recovering Within Eight Weeks Dr Tom Cherian | Sakshi
Sakshi News home page

ఎనిమిది వారాల్లో కాలేయ మార్పిడి రోగులు కోలుకుంటున్నారు..

Jun 12 2026 7:46 AM | Updated on Jun 12 2026 7:54 AM

Liver Transplant Patients Are Recovering Within Eight Weeks Dr Tom Cherian

– డాక్టర్‌ టామ్‌ చెరియన్‌ 

కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకన్న చేయించుకున్న వారు ఎనిమిది వారాల్లోనే పూర్తి స్థాయిలో కోలుకుంటున్నారని సౌత్‌ ఏషియన్‌ లివర్‌ ఇనిస్టిట్యూట్‌ వ్యవస్థాపకులు, ప్రొఫెసర్‌ డాక్టర్‌ టామ్‌ చెరియన్‌ అన్నారు. ప్రపంచ అవయవ ట్రాన్స్‌ప్లాంట్‌ డే వేడుకలను ఆయన బంజారాహిల్స్‌లోని సౌత్‌ ఏషియన్‌ లివర్‌ ఇనిస్టిట్యూట్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకల్లో భాగంగా ఆయన 1995లో అయవవ దానంతో పాటు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చట్టం తీసుకొచ్చిన నాటి హెల్త్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ మాజీ ఏఐఎస్‌ ఏపీవీఎన్‌ శర్మతో పాటు లివర్‌ దాతలను, కాలేయ గ్రహితలను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మందికి ఆల్కహాల్‌ వల్ల లివర్‌ సమస్యలు వస్తాయనే అపోహలు ఉన్నాయని 30 శాతం ఫ్యాటీ లివర్‌ కేసుల్లో మాత్రమే ఆల్కహాల్‌ వల్ల సంభవిస్తాయని 70 శాతం కేసుల్లో జన్యుపరంగా, డయాబెటిస్, ఒబేసిటి కారణాలు ఉంటాయని అన్నారు. 

ఫ్యాటీ లివర్‌ స్థాయిలో ఉన్నప్పుడు జాగ్రత్త పడాలని లివర్‌ సిరోసిస్‌గా మారి వ్యాధి ముదిరితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆయన అన్నారు. అవయవ దానంపై ఎంతో అవగాహన పెరుగుతుందని ప్రతియేటా దేశంలో 2లక్షల మందికిపైగా అవయవాలు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకొని ఆరోగ్యంగా జీవిస్తున్నారని అయవవ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్సల్లో మన దేశంలో ప్రపంచంలోనే అయిదో స్థానంలో ఉందని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement