Letter Goes Viral: కన్నతండ్రి కళ్ల ముందే విగతజీవిలా మారితే.. దిక్కులు పిక్కటిల్లేలా చేసిన రోదన

Letter Sudhamadhuri Friend Over Father Deceased With Corona - Sakshi

షాద్‌నగర్‌ (రంగారెడ్డి): కరోనా సృష్టించిన విషాదం కన్నీటి అక్షరం అయింది. కన్న తండ్రిని పోగొట్టుకున్న ఓ చిన్నారి గుండెలో వేదన లేఖగా మారింది. పాఠశాలలు మూసేసి .. ఇంటికి వెళ్తున్న తరణంలో ఓ విద్యార్థిని తన కన్నీటి గాథకు అక్షర రూపం ఇచ్చింది.

కరోనా సమయంలో కన్న తండ్రిని కాపాడుకునేందుకు పడిన వేదన.. ఆస్పత్రి సేవల కోసం చేసిన శోధన.. అంటరాని వాళ్లను చేసి అందరూ దూరం చేస్తే  ఒంటరిగా పడిన యాతన.. చివరికి కన్నతండ్రి కళ్ల ముందు విగత జీవిగా పడి ఉంటే దిక్కులు పిక్కటిల్లేలా చేసిన రోదన.. అన్నింటినీ తన లేఖలో వ్యక్తపరిచింది.

ఫరూఖ్‌నగర్‌ మండలం లింగారెడ్డిగూడలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సుధామాధురి ఐదో తరగతి చదువుతోంది. ఆదివారం నుంచి వేసవి సెలవులు కావడంతో శనివారం చివరి రోజు తన స్నేహితురాలికి లేఖ రాసింది. కరోనా సమయంలో చిన్నారి అనుభవించిన మానసిక వేదన చదివిన వారిని కంటతడి పెట్టించింది.   

చదవండి: (విషాదం: సంబంధాలు వస్తున్నాయి.. భూమి కొనడానికి ఎవరూ రాక..)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top