COVID19: Last 24hours 1481 New Corona Positive Cases Recorded In Telangana | భారీగా తగ్గుతున్న కరోనా కేసులు - Sakshi
Sakshi News home page

తెలంగాణ: భారీగా తగ్గుతున్న కరోనా కేసులు

Oct 28 2020 9:13 AM | Updated on Oct 28 2020 12:14 PM

In Last 24 Hours 1481 Corona Positive Cases Reported In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 40,081 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,481 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,34,152కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందడంతో మరణాల సంఖ్య 1,319కి చేరింది.    (స్కూళ్లు మరింత ఆలస్యం!)

నిన్న ఒక్క రోజే 1,451 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య 2,14,917కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,916 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 14,883 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 41,55,597కి చేరింది.

Advertisement
 
Advertisement
Advertisement