పెద్ది సుదర్శన్‌పై కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

KTR Speech On Development Works In Narsampet - Sakshi

వరంగల్: తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా.. ఎక్కడ  లేని విధంగా నర్సంపేటలో తక్కువ  ధరలో ఇంటి ఇంటికి గ్యాస్  కనెక్షన్ ఇచ్చి పెద్ది సుదర్శన్‌రెడ్డి కొత్త చరిత్ర సృష్టించారని రాష్ట్ర పురపాలక  శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక  రామారావు  అన్నారు. నర్సంపేటలో పర్యటించిన కేటీఆర్‌  మాట్లాడుతూ.. కార్యకర్త నుంచి సర్పంచ్, జడ్పీటీసీ, ఎమ్మెల్యే అయి పేద  ప్రజల కోసం  నిరంతరం కృషి  చేస్తున్నాడని తెలిపారు.

రూ. 100 కోట్ల పై చిలుకు  నిధులను  మంజూరు  చేపించుకొని నర్సంపేటలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. ఎక్కడ కలిసిన  నర్సంపేట అభివృద్ధి గురించే ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతారని తెలిపారు.14 ఏళ్ల పాటు కొట్లాడి రోడ్లలకి  ఎక్కి రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. బంగారు  తెలంగాణ కోసం ఒక్కో అడుగు వేసుకుంటూ పోతున్నామని అన్నారు. 75ఏళ్ల భారత దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇంటి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చిన  ఘనత  మన తెలంగాణదని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక  నర్సంపేటలో 2 ఇరిగేషన్ ప్రాజెక్టులను మంజూరు చేసుకొని రూ. 670 కోట్ల రూపాయలను  వెచ్చించి 60 వేల ఎకరాలకి  నీళ్లు ఇచ్చామని తెలిపారు.

24 గంటలు  కరెంట్ ఇచ్చిన  ఏకైక  రాష్ట్రం ఒక్క  తెలంగాణ మాత్రమేనని అన్నారు. ఒక్కో రైతుకి పెట్టుబడి సాయంగా రూ. 5000 ఇచ్చిన  ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని గుర్తుచేశారు. నర్సంపేటలో పసుపు, పత్తి, మిర్చి బాగా పండుద్దని, వివిధ పంటల కోసం త్వరలో ఆహారశుద్ధి ఫ్యాక్టరీ ఇస్తామని తెలిపారు. మిగిలిపోయిన అభివృద్ధి పనుల కోసం త్వరలో రూ. 50 కోట్లను మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top