‘దళిత సీఎం అనే చర్చ కాంగ్రెస్‌లో లేదు.. అది కోమటిరెడ్డి వ్యక్తిగత అభిప్రాయం’

Komatireddy Venkat Reddy dalit CM Comment Manikrao Thakre Reacts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘దళిత ముఖ్యమంత్రి’ వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే స్పందించారు. దళిత సీఎం అనే చర్చ కాంగ్రెస్‌లో లేదని, కాంగ్రెస్‌ అన్ని వర్గాలను ఆదరిస్తుందని ఠాక్రే​ స్పష్టత ఇచ్చారు. 

దళిత సీఎం అనే చర్చ కాంగ్రెస్‌లో ఏనాడూ జరగలేదు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. కాంగ్రెస్‌ అన్ని వర్గాలను ఆదరిస్తుందని పేర్కొన్నారాయన. అలాగే ఏలేటి మహేశ్వరరెడ్డి బీజేపీ చేరికపైనా ఠాక్రే స్పందించారు.  

మహేశ్వర్‌రెడ్డికి కాంగ్రెస్‌ ఏం తక్కువ చేయలేదు. కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు సముచిత స్థానం కల్పించింది. ఆయన పార్టీని ఎందుకు వీడారో చెప్పాల్సిన అవసరం ఉందని ఠాక్రే వ్యాఖ్యానించారు. 

మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్‌ అధికార పార్టీ బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటుందని కాంగ్రెస్‌ శ్రేణుల్లోనే చర్చ నడుస్తోంది. దీనిపై ఠాక్రే స్పందిస్తూ.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదు. ఈ విషయంపై పార్టీ కీలక నేత రాహుల్‌ గాంధీ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని ఠాక్రే తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top