బాలుడి దవడలోకి దిగిన సైకిల్‌ బ్రేక్‌ పెడల్‌ 

Khammam Bicycle Brake Pedal Went Into Boys Jaw - Sakshi

జడ్చర్ల: సైకిల్‌పై వెళ్తుండగా కింద పడిన బాలుడి దవడలోకి చేతితో పట్టుకునే బ్రేక్‌ పెడల్‌ దిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలోని పోలేపల్లికి చెందిన సంతోష్‌ నాలుగో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం ఇంటి నుంచి ట్యూషన్‌కు సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీంతో బ్రేక్‌ పెడల్‌ ఒక్కసారిగా దవడ భాగంలోకి చొచ్చుకుపోయింది. ఇది గమనించిన గ్రామస్తులు వెంటనే ఆ బాలుడిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఏనుగొండ ఎస్‌వీఎస్‌ ఆస్పత్రికి తరలించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top