
ఉన్నత విద్యలో ఈ ఏడాది నుంచి కీలక మార్పులు
పల్లె నుంచి పట్నం దాకా విద్యార్థులకు నైపుణ్య ప్రణాళిక
ఓపెన్ నాలెడ్జ్ సెంటర్‌గా ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్
ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, డిగ్రీ సహా ఉన్నత విద్యలో ఈ విద్యా సంవత్సరం నుంచి గుణాత్మక మార్పులు చోటుచేసుకోబోతున్నాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి రాజధాని వరకు ప్రతి విద్యార్థికి నైపుణ్యంతో కూడిన మాడ్యూల్స్ అందించబోతున్నట్టు చెప్పారు. సెల్‌ఫోన్‌కు కనెక్ట్ అయినా అంతర్జాతీయ విద్యా ప్రమాణాలు అందిపుచ్చుకునే వెసులుబాటు ఉండబోతోందని పేర్కొన్నారు. నైపుణ్యాల కోసం రూ.లక్షలు వెచ్చించి కోచింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఇకపై ఉండదని చెప్పారు. 2025–26 విద్యా సంవత్సరం మొదలవుతున్న నేపథ్యంలో మంగళవారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నాణ్యమైన విద్యే ప్రామాణికంగా ఉన్నత విద్యలో తీసుకొస్తున్న సంస్కరణలను వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ఈ–లైబ్రరీ రెడీ
ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌ను ఆధునీకరించాం. ఇప్పుడు దీనిని 1.5 లక్షల మంది చూస్తున్నారు. ఇందులో సమాచారం మొత్తం ఉంది. గ్రీవెన్స్ సెల్ కూడా పెట్టాం. సమస్యలు, సూచనలు వెబ్ ద్వారానే పంపొచ్చు. ఫీడ్‌బ్యాక్‌గా దీన్ని తీసుకుంటున్నాం. మార్పులు చేసుకుంటున్నాం. మండలి న్యూస్ లెటర్ వెబ్‌సైట్‌లో లభిస్తుంది. వివిధ రంగాల నిపుణుల రీసెర్చ్ ఆరి్టకల్స్‌తో ఉన్న జర్నల్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఒక్కపైసా ఖర్చు లేకుండా 13,500 జర్నల్స్‌ను వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అంతర్జాతీయ నైపుణ్య మెళకువలు ఇందులో లభిస్తాయి. మారుమూల ప్రాంతాల విద్యా ర్థులు కూడా డిజిటల్ లైబ్రరీ ద్వారా నాలెడ్జ్ పెంచుకోవచ్చు.
పారిశ్రామిక ‘విద్య’
గ్రాడ్యుయేషన్‌లో మార్కులు ప్రామాణికం కానేకాదు. నైపుణ్యాన్నే పరిశ్రమలు పరిగణనలోనికి తీసుకుంటున్నాయి. అందుకే అకడమిక్ విద్యతో పరిశ్రమలను లింక్ చేస్తున్నాం. బల్‌్కడ్రగ్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్, బీడీఎంఏ, బీఎస్‌ఎఫ్‌ఐ... ఇలా అనేక సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఇవన్నీ గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే నైపుణ్యం అందిస్తాయి. ఇప్పటికే 400 మంది ఇంటర్న్íÙప్ కూడా చేస్తున్నారు. పుస్తకాల జ్ఞానమే కాదు.. పారిశ్రామిక స్కిల్స్ అవసరం. అప్పుడే ఉపాధి లభిస్తుంది. టీ–శాట్ ద్వారా ఓపెన్ లెక్చర్స్ ఇప్పిస్తున్నాం. రీసెర్చ్‌లో నాణ్యత పెరగాలి. ప్రపంచంతో పోటీ పడేలా ఉండాలి. బ్రిటన్, ఆ్రస్టేలియా, జర్మనీ, ఫ్రాన్స్ సంస్థలను రంగంలోకి దించాం. ఉన్నత విద్య సంస్థలతో ఇవి భాగస్వామ్యమవుతాయి. విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అందిస్తాయి.
కోర్ సబ్జెక్టులకే భవిష్యత్
విద్యార్థులు మూస ఆలోచనలకు స్వస్తి చెప్పాలి. ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ కోర్సులు చదివితేనే ఉద్యోగాలు వస్తాయనే భ్రమ వీడాలి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయి. విద్యార్థుల అవగాహన లోపమే దీనికి కారణం. సాఫ్ట్‌వేర్ వైపే వెళ్లాలనుకుంటే ఏ కోర్సు చేస్తే ఏం? ఉదాహరణకు మెకానికల్ తీసుకుని, మైనర్ కోర్సుగా కంప్యూటర్స్ కోర్సు తీసుకోవచ్చు. అప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రాదా? చాలా మంది ఓ విషయాన్ని తెలుసుకోవాలి. సివిల్, మెకానికల్ అన్నింటికీ సాంకేతికత తోడవుతుంది. సిలబస్‌ను ఈ విధంగా రూపొందించాం. డిగ్రీ, ఇంజనీరింగ్‌లో ఈ ఏడాది నుంచే 20 శాతం స్కిల్ సబ్జెక్టులు ఉంటాయి. కంప్యూటర్ పరిజ్ఞానంతో చాప్టర్లు ఉంటాయి. నాలెడ్జ్ ఉంటేనే ఇవన్నీ సాధ్యం అని వివరించారు.